Manchu Manoj: ఎన్నాళ్లో వేచిన హృదయం.. తాళి కట్టే ముందు మంచు మనోజ్ కంటతడి..

ఇటీవల మార్చి 3న తన స్నేహితురాలు భూమా మౌనిక రెడ్డిని మంచు మనోజ్ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. తన సోదరి మంచు లక్ష్మి నివాసంలో బంధుమిత్రులు, కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి ఘనంగా జరిగింది.

Manchu Manoj: ఎన్నాళ్లో వేచిన హృదయం.. తాళి కట్టే ముందు మంచు మనోజ్ కంటతడి..
Manchu Manoj
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 06, 2023 | 11:08 AM

మనసులోని సంతోషం కళ్లల్లో కనిపిస్తుంది అంటారు. మాటల్లో చెప్పలేని ఆనందమంతా కన్నీళ్లుగా మారిపోతుంది. అలాంటి దృశ్యాలు కొన్ని సందర్భాల్లో ఫోటోలలో బంధించేస్తాము. ఆ ఒక్క ఫోటో మనలోని మానసిక సంఘర్షణను జయించిన విజయాన్ని తెలియజేస్తుంది. తాజాగా మంచు మనోజ్‏కు సంబంధించిన ఓ ఫోటో తనలో ఇన్నాళ్లు గూడు కట్టుకున్న ఆశల తాలూకు విజయం కనిపిస్తోంది. కోరుకున్న తరుణం కళ్లముందుకు వచ్చినప్పుడు తెలియకుండానే వచ్చిన కన్నీళ్లు ఆనందబాష్పాలయ్యాయి. ఇటీవల మార్చి 3న తన స్నేహితురాలు భూమా మౌనిక రెడ్డిని మంచు మనోజ్ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. తన సోదరి మంచు లక్ష్మి నివాసంలో బంధుమిత్రులు, కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి ఘనంగా జరిగింది.

వీరి వివాహనికి సంబంధించిన కొన్ని ఫోటోలను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ.. “రెండు హృదయాలు… కానీ మనసు ఒక్కటే.. ఇలాగే ఎప్పటికీ” అంటూ క్యాప్షన్ ఇచ్చింది మంచు లక్ష్మి. ప్రస్తుతం ఈ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

అయితే పెళ్లి జీలకర్ర బెల్లం పెడుతున్న సమయంలో మంచు మనోజ్ భావోద్వేగానికి గురయ్యారు. చాలా కాలంగా ఎదురుచూస్తున్న తరుణం కళ్లముందుకు రావడంతో ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. మరోవైపు మోహన్ బాబును పట్టుకొని ఎమోషనల్ అయ్యారు మౌనిక. వీరిద్దరి జీవితాలు విడి విడిగా ప్రారంభమయిన.. చివరకు మూడు మూళ్ల బంధంతో వీరు ఒకటయ్యారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.