Janhvi Kapoor: యంగ్ టైగర్ సరసన ‘జాన్వీ కపూర్’.. NTR 30 నుంచి జాన్వీ ఫస్ట్ లుక్ పోస్టర్ అదుర్స్..

తారక్ సరసన అతిలోక సుందరి శ్రీదేవి తనయ బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తున్నట్లుగా కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతుంది. తనకు ఎన్టీఆర్ సరసన నటించాలని ఉందంటూ గతంలో ఓ ఇంటర్వ్యూలో జాన్వీ సైతం చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాలో జాన్వీ నటిస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

Janhvi Kapoor: యంగ్ టైగర్ సరసన 'జాన్వీ కపూర్'.. NTR 30 నుంచి జాన్వీ ఫస్ట్ లుక్ పోస్టర్ అదుర్స్..
Ntr, Janhvi Kapoor
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 06, 2023 | 11:39 AM

ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ అందుకున్న ఎన్టీఆర్.. ప్రస్తుతం మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా టైటిల్ ఫిక్స్ చేయ్యని ఈ సినిమా NTR30 వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమా అప్డేట్స్ కోసం తారక్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇందులో నటించే నటీనటుల గురించి ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ ప్రకటన రాలేదు. ఈసినిమాలో తారక్ సరసన అతిలోక సుందరి శ్రీదేవి తనయ బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తున్నట్లుగా కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతుంది. తనకు ఎన్టీఆర్ సరసన నటించాలని ఉందంటూ గతంలో ఓ ఇంటర్వ్యూలో జాన్వీ సైతం చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాలో జాన్వీ నటిస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

ఈరోజు జాన్వీ పుట్టినరోజు సందర్భంగా NTR 30 నుంచి జాన్వీ కపూర్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. తాజాగా విడుదలైన పోస్టర్‏లో జాన్నీ పక్కా పల్లెటూరు అమ్మాయిగా హాఫ్ సారీలో మరింత అందంగా కనిపిస్తున్నారు. ఈ చిత్రాన్ని యువసుధ ఆర్ట్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లపై నిర్మిస్తుండగా.. అనిరుధ్ రవి చందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.