Ravanasura Teaser: ‘రావణసుర’ టీజర్ వచ్చేసింది.. మూవీపై అంచనాలు పెంచేస్తోన్న రవితేజ డైలాగ్స్‌..

డిఫరెంట్‌ జోనర్‌ను టచ్‌ చేస్తూ రూపొందించిన ఈ సినిమాలో కీ రోల్‌ పోషిస్తున్నారు రవితేజ. రీసెంట్‌గా ఆయన నటించిన ధమాకా, వాల్తేరు వీరయ్య సినిమాలు హిట్టవడంతో..ఈ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి.

Ravanasura Teaser: 'రావణసుర' టీజర్ వచ్చేసింది.. మూవీపై అంచనాలు పెంచేస్తోన్న రవితేజ డైలాగ్స్‌..
Raviteja
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 06, 2023 | 11:59 AM

ఇటీవలే ధమాకా చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు మాస్‌ రాజా రవితేజ. శ్రీలీల కథానాయికగా నటించిన ఈ చిత్రం భారీగా వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా విజయంతో ఫుల్ జోష్‏లో ఉన్న మాస్ మహారాజా ప్రస్తుతం డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వంలో రావణాసుర సినిమా చేస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ రిలీజ్‌ చేసింది చిత్రయూనిట్. డిఫరెంట్‌ జోనర్‌ను టచ్‌ చేస్తూ రూపొందించిన ఈ సినిమాలో కీ రోల్‌ పోషిస్తున్నారు రవితేజ. రీసెంట్‌గా ఆయన నటించిన ధమాకా, వాల్తేరు వీరయ్య సినిమాలు హిట్టవడంతో..ఈ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి.

సీతన తీసుకెళ్లాలంటే సముద్రం దాటితే సరిపోదు..ఈ రావణాసురుడిని దాటి వెళ్లాలన్న డైలాగ్‌తో.. అసలు ఈ మూవీలో రవితేజ పాత్ర ఎలా ఉంటుందోనన్న ఆసక్తి నెలకొంది. అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌తో కలిసి రవితేజ ప్రొడక్షన్ ఈ మూవీని నిర్మిస్తోంది. సుధీర్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీని ఏప్రిల్‌ 7న రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. ఇందులో మేఘ ఆకాశ్, దక్ష నగార్కర్, పూజిత పొన్నాడ కథానాయికలుగా నటిస్తుండగా.. రావు రమేశ్, సుశాంత్ కీలకపాత్రలలో కనిపించనున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.