Amitabh Bachchan: ‘ప్రాజెక్ట్ కె’ సెట్‏లో ప్రమాదం.. తీవ్రంగా గాయపడిన అమితాబ్ బచ్చన్..

ఈ సినిమాలోని ఓ యాక్షన్ సన్నివేశం చిత్రీకరిస్తున్నప్పుడు ప్రమాదం జరిగిందని.. తనకు గాయాలయ్యాయని తెలిపారు. ప్రస్తుతం తాను ముంబైలోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నట్లు తెలిపారు.

Amitabh Bachchan: 'ప్రాజెక్ట్ కె' సెట్‏లో ప్రమాదం.. తీవ్రంగా గాయపడిన అమితాబ్ బచ్చన్..
Amitabh, Project K
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 06, 2023 | 10:33 AM

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ షూటింగ్‍లో ప్రమాదానికి గురయ్యారు. ప్రాజెక్ట్ కె షూటింగ్ సెట్ లో చిన్న ప్రమాదం జరగడంతో తనతోపాటు మరికొద్ది మంది యూనిట్ సభ్యులు గాయపడ్డారని.. ప్రస్తుతం తాను విశ్రాంతి తీసుకుంటుండగా.. మిగతా వారికి చికిత్స అందిస్తున్నారని అన్నారు అమితాబ్. కొద్ది రోజుల క్రితం సొంతంగా బ్లాగ్ క్రియేట్ చేసిన అమితాబ్ తన జీవితంలో జరిగిన విషయాలను పంచుకుంటున్నారు. తాజాగా ఇందులో తాను ఇటీవల ప్రాజెక్ట్ కె సినిమా చిత్రీకరణ సెట్ లో ప్రమాదానికి గురైనట్టు తెలిపారు. ఈ సినిమా షూటింగ్ కొద్ది రోజులుగా హైదరాబాద్‏లో శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాలోని ఓ యాక్షన్ సన్నివేశం చిత్రీకరిస్తున్నప్పుడు ప్రమాదం జరిగిందని.. తనకు గాయాలయ్యాయని తెలిపారు. ప్రస్తుతం తాను ముంబైలోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నట్లు తెలిపారు.

“హైదరాబాద్‌లో ‘ప్రాజెక్ట్ కె’ షూటింగ్ సమయంలో ఒక యాక్షన్ షాట్ సమయంలో ప్రమాదం జరిగింది. వెంటనే AIG హాస్పిటల్‌లో డాక్టర్లను సంప్రదించగా.. నాకు CT స్కాన్ చేశారు. మిగతావారికి ఇంకా చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం నేను ఇంట్లో ఉండి విశ్రాంతి తీసుకుంటున్నాను. నా గాయం కాస్త నొప్పిగానే ఉంది.. కదలడానికి , ఊపిరి తీసుకోవడంలో కొంచెం ఇబ్బంది ఉంది. కోలుకోవడానికి కొన్ని వారాలు పడుతుంది. నొప్పికి కొన్ని మందులు ఉపయోగిస్తున్నాను. గాయం కారణంగా చేయాల్సిన పనులన్నీ ఆగిపోయాయి. చికిత్స పూర్తయ్యే వరకు ఎలాంటి పనులు చేయకూడదు. ముఖ్యమైన పనులను ఫోన్ ద్వారా అటెండ్ చేస్తున్నాను. ఈరోజు సాయంత్రం అభిమానులను కలవలేను. అందుకే ఎవరు రావద్దు.” అంటూ తన బ్లాగ్ లో చెప్పుకొచ్చారు అమితాబ్.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, దీపికా పదుకొణే జంటగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తోన్న చిత్రం ప్రాజెక్ట్ కె. అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తోన్న ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్ మూవీపై మరింత క్యూరియాసిటి పెంచగా.. ఇందులో అమితాబ్ బచ్చన్ కీలకపాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.