Selena Gomez: నాకు పిల్లలను కనే శక్తి లేదు.. కారణం ఇదే.. స్టార్ సింగర్ సంచలన కామెంట్స్..

సెలీనా టీనేజ్ లో ఉన్నప్పుడే పాప్ సింగర్ జస్టిన్ బీబర్‏ను ప్రేమించింది. కొన్నాళ్లపాటు ప్రేమలో ఉన్న వీరిద్దరు కలిసి ఎన్నో సాంగ్స్ ఆలపించారు. అలాగే పార్టీస్, మూవీస్ ఈవెంట్లలోనూ సందడి చేశారు. కానీ అనుహ్యాంగా జస్టిన్ బీబర్ మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవడంతో సెలీనా.. కొన్ని నెలలపాటు డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది.

Selena Gomez: నాకు పిల్లలను కనే శక్తి లేదు.. కారణం ఇదే.. స్టార్ సింగర్ సంచలన కామెంట్స్..
Selena Gomez
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 10, 2024 | 9:17 PM

సోషల్ మీడియాలో సెలబ్రెటీల వ్యక్తిగత జీవితం గురించి తరచూ చర్చిస్తారు. ఇక స్టార్స్ ప్రేమ, పెళ్లి, ఫ్యామిలీ విషయాల గురించి తెలుసుకోవడానికి నెట్టింట చర్చ జరుగుతుంది. ముఖ్యంగా సినీతారల లవ్, డేటింగ్ గురించి నెట్టింట చక్కర్లు కొట్టే రూమర్స్ గురించి చెప్పక్కర్లేదు. తాజాగా అమెరికన్ సింగర్ సెలీనా గోమెజ్ పేరు నెట్టింట ట్రెండ్ అవుతుంది. తనకు పిల్లలను కనే శక్తి లేదని.. అందుకు కారణం తాను ఇప్పటికీ పోరాడుతున్న ఆరోగ్య సమస్యలే అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సెలీనా గోమెజ్ వయసు 32 సంవత్సరాలు. అమెరికాలో సెలీనా సింగర్ కమ్ రైటర్. ఇప్పటివరకు ఆమె పాడిన పాటలు, రిలీజ్ చేసిన ఆల్బమ్స్ సూపర్ హిట్ అయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ఆమెకు కోట్లాది మంది అభిమానులు ఉన్నారు.

సెలీనా టీనేజ్ లో ఉన్నప్పుడే పాప్ సింగర్ జస్టిన్ బీబర్‏ను ప్రేమించింది. కొన్నాళ్లపాటు ప్రేమలో ఉన్న వీరిద్దరు కలిసి ఎన్నో సాంగ్స్ ఆలపించారు. అలాగే పార్టీస్, మూవీస్ ఈవెంట్లలోనూ సందడి చేశారు. కానీ అనుహ్యాంగా జస్టిన్ బీబర్ మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవడంతో సెలీనా.. కొన్ని నెలలపాటు డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది. ఆ తర్వాత పలు అనారోగ్య సమస్యలతో పోరాడింది. ఇప్పటికీ సింగిల్ గా ఉంటున్న సెలీనా పెళ్లి చేసుకోకపోవడానికి కారణాన్ని వెల్లడించింది.

“ఎన్నో అనారోగ్య సమస్యలతో పోరాడుతున్నాను. నాకు బిడ్డను కనే శక్తి లేదు. నాకు, నా బిడ్డకు ప్రమాదకరం. అందుకు నేను ఎంతో చింతిస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చింది. సెలీనా ఆటో ఇమ్యూన్ వ్యాధితో బాధపడుతున్నానని… ఇది శరీరం రోగనిరోధక వ్యవస్థ పై దాడి చేస్తుందని తెలిపింది. 2017లో సెలీనా గోమెజ్ కిడ్నీ మార్పిడి జరిగింది. ఈ విషయాన్ని ‘మై మైండ్ అండ్ మి’లో బయటపెట్టింది. సరోగసీ లేదా దత్తత ద్వారా బిడ్డను పొందాలని ఉందని చెప్పుకొచ్చింది.

View this post on Instagram

A post shared by Selena Gomez (@selenagomez)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.