Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RRR Movie: ఆర్ఆర్ఆర్‌లో నటించిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? బ్యాగ్రౌండ్ తెలిస్తే బిత్తరపోతారు

ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిన చిత్రం 'ఆర్ఆర్ఆర్' 2022లో వచ్చిన ఈ చిత్రం ఆస్కార్ అవార్డుతో పాటు పలు గ్లోబల్ అవార్డులను సైతం సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఒక్కసారిగా ఈ చిత్రం తెలుగు సినిమా ఖ్యాతిని

RRR Movie: ఆర్ఆర్ఆర్‌లో నటించిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? బ్యాగ్రౌండ్ తెలిస్తే బిత్తరపోతారు
Rrr
Ravi Kiran
|

Updated on: Sep 11, 2024 | 9:30 AM

Share

ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ 2022లో వచ్చిన ఈ చిత్రం ఆస్కార్ అవార్డుతో పాటు పలు గ్లోబల్ అవార్డులను సైతం సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఒక్కసారిగా ఈ చిత్రం తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ వేదికలపై తెలిసేలా చేసిందని అనడంలో అతిశయోక్తి లేదు. ఇక ఈ సినిమాలో మల్లి అనే పాత్రలో మెరిసిన చిన్న పిల్ల మీకు గుర్తుందా.? సినిమాకి కీలకంగా మారిన ఆ పాత్రలో ఆ అమ్మాయి తన నటనతో అందరినీ మెప్పించింది. ఇక ఆమె తల్లిగా నటించిన నటి ఎవరో మీకు తెలుసా.? గొండు జాతి మహిళగా.. బ్రిటీష్ రాణి తన కూతురుని తీసుకెళ్తుంటే.. బిడ్డ కోసం పరితపిస్తూ.. ఆ కారు వెంట పరిగెడుతుంది. బిడ్డను తిరిగి తన ఒడికి చేరినప్పుడు సంబరపడిపోతుంది ఈ తల్లి. ఇక ఈ లోకి పాత్రలో కన్నీరు పెట్టించిన ఆ నటి మరెవరో కాదు అహ్మరీన్ అంజుమ్.

ఇది చదవండి: R అక్షరంతో పేరున్న వ్యక్తుల వ్యక్తిత్వం ఎలాంటిదంటే.? ఆ విషయంలో జగమొండి

ఆమె ఓ హిందీ నటి. షార్ట్ ఫిల్మ్స్, కమర్షియల్ యాడ్స్, టెలివిజన్ షోస్, సినిమాలలో కూడా నటించింది. అలాగే ఆమె స్టేజ్ ఆర్టిస్టు కూడా. ఇంకా చెప్పాలంటే హిందీ, ఇంగ్లీష్‌తో పాటు ఉర్దూ, బెంగాళీ, తెలుగు లాంటి పలు భాషలను అనర్గళంగా మాట్లాడే బహుముఖ ప్రజ్ఞాశాలి. 2022లోని బ్రిటీష్- సౌత్ ఏషియన్ యాక్టర్ డానీ సురాను వివాహమాడింది ఈమె. ఈమె నటి మాత్రమే కాదు.. నటనలో గుర్తింపు సాధించాలనుకునేవారికి తన భర్తతో కలిసి యాక్టింగ్‌ క్లాసులు చెబుతుంది.

ఇది చదవండి: బాలికతో 20 రోజులు ఓయో రూమ్‌లో.. చివరికి తను ఏం చేసిందంటే

ఇది చదవండి: S అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తుల వ్యక్తిత్వం ఎలాంటిదో తెల్సా? రొమాన్స్‌లో రెచ్చిపోతారట

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి