14 January 2025

16 ఏళ్లకే స్టార్ హీరోయిన్.. సీఎం కొడుకుతో ప్రేమ, పెళ్లి.. ఇప్పుడు..

Rajitha Chanti

Pic credit - Instagram

ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్. 16 ఏళ్ల వయసులోనే దక్షిణాదిలో అగ్ర కథానాయికగా ఫేమస్ అయ్యింది ఈ ముద్దుగుమ్మ.

తెలుగు, తమిళం, హిందీ భాషలలో వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులకు దగ్గరైంది. ముఖ్యమంత్రి కొడుకుని ప్రేమించి పెళ్లి చేసుకుంది.

ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా.. ? మరెవరో కాదు టాలీవుడ్ టాప్ బ్యూటీ జెనీలియా. 16 ఏళ్ల వయసులోనే ఆమె స్టార్ హీరోయిన్.

బాలీవుడ్ స్టార్ హీరో రితేష్ దేశ్ ముఖ్ సరసన తుజే మేరీ కసమ్ సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టి మొదటి సినిమాతోనే హిట్టు అందుకుంది.

రితేశ్ దేశ్ ముఖ్ మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి తనయుడు. దీంతో అతడికి అహంకారం ఉంటుదని భావించగా.. అతడు అందుకు విరూద్దం. 

మొదటి సినిమా సమయంలోనే వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారింది. 9 ఏళ్లు ఇద్దరు ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. 

ఆ తర్వాత పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైంది జెనీలియా. 

పెళ్లి తర్వాత దాదాపు 10 ఏళ్లకు పైగా సినిమాలకు దూరంగా ఉంటుంది. ప్రస్తుతం ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న జెనీలియా ఇప్పుడు రీఎంట్రీ ఇస్తుంది.