Singer Chinmayi: మరోసారి సింగర్ చిన్మయి షాకింగ్ కామెంట్స్.. వారి భార్యలు గొప్పవారంటూ..
మహిళలపై జరుగుతున్న దాడులపై సోషల్ మీడియా వేదికగా తన గళం విప్పుతుంటుంది సింగర్ చిన్మయి.

మహిళలపై జరుగుతున్న దాడులపై సోషల్ మీడియా వేదికగా తన గళం విప్పుతుంటుంది సింగర్ చిన్మయి. సమాజంలో మహిళల పట్ల జరుగుతున్న దాడులు.. వారు ఎదుర్కోంటున్న వేధింపుల గురించి ట్విట్టర్ వేదికగా ప్రశ్నిస్తూ ఉంటారు. ప్రముఖ హీరోయిన్ పై జరిగిన కిడ్నాప్, లైంగిక దాడి పట్ల ఆమెకు మద్దతు తెలిపిన నటి ఉపాది కోల్పోవడం గురించి తనదైన స్టైల్లో స్పందించింది. తాజాగా మరోసారి సింగర్ చిన్మయి తన ఇన్ స్టా ఖాతాలో ఆసక్తికర ట్వీట్ చేసింది.
మాములుగా అయితే ఆడవాళ్లు పెళ్లైన తర్వాత ఏ జాబ్ చేసినా.. బయటకు వెళ్లినా .. ఎంతో ఎత్తుకు ఎదిగిన కూడా భర్తను పొగుడుతుంటారు. మీ వారు మంచివారు.. మిమ్మల్ని పని చేసుకోనిచ్చారు అనే మాటలు వినిపిస్తుంటాయి. ఇలాంటి మాటలే డైరెక్టర్ సుధా కొంగర చెవిన పడ్డాయి. దీంతో ఆ ప్రశ్న అడిగినవారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది సుధా కొంగర.. కొందరు నన్ను అడుగుతుంటారు. మీ ఆయన చాలా గ్రేట్.. నిన్ను సినిమాలు చేసుకోనిచ్చారు అంటుంటారు. అలాంటి వారితో నేను గొడవకు దిగుతుంటాను.. ఈ పని చేయడానికి నాకు ఎవరూ పర్మిషన్ గానీ.. అంగీకారాన్ని గానీ ఇవ్వలేదు. నాకు నచ్చింది నేను చేస్తున్నాను అంటుంటారు సుధా కొంగర.. ఇక ఇదే విషయంపై తనదైన స్టైల్లో స్పంధించింది సింగర్ చిన్మయి.
“సినిమా దర్శకులు..నటులు, సంగీత దర్శకులు, క్రియేటర్స్, లాయర్స్, డాక్టర్స్, పొలిటిషియన్స్ భార్యలు నిజాంగానే గ్రేట్.. మీరు మీ భర్తలకు పని చేసుకునే స్వేచ్చను, పర్మిషన్ ఇచ్చారు ” అంటూ సెటైర్ వేసింది. ఇక సింగర్ చిన్మయి పోస్టుకు పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతున్నారు నెటిజన్స్.
View this post on Instagram
Coronavirus: కరోనా బారిన పడిన ‘ఖిలాడీ’ బ్యూటీ.. రెండు డోసులు టీకా తీసుకున్నా వదలని వైరస్..
Ashok Galla’s HERO: హీరో చిత్రయూనిట్ థాంక్యూ మీట్.. మంచి టాక్ ను సొంతం చేసుకున్న అశోక్ గల్లా మూవీ..
Bangarraju: సినిమా చూసి ఇంటికి రాగానే అమల ఏడ్చేసింది.. ఆసక్తికర విషయం చెప్పిన నాగార్జున




