Atlee- Chinmayi: డైరెక్టర్ అట్లీ కలర్‌పై బాలీవుడ్ కమెడియన్ కామెంట్స్.. సింగర్ చిన్మయి షాకింగ్ రియాక్షన్

బాలీవుడ్ కమెడియన్ కపిల్ శర్మ ప్రశ్నపై విమర్శల వర్షం కురుస్తోంది. అట్లీ రంగు ను ఉద్దేశించి ఇలాంటి కామెంట్స్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని నెటిజనం ప్రశ్నిస్తున్నారు. మరికొందరు 'కపిల్ శర్మ వైపు నుంచి ఇలాంటి ప్రశ్నలు రావడంలో ఆశ్చర్యం ఏమీ లేదు' అని మండిపడుతున్నారు. దీనిపై ఆయన క్షమాపణలు చెప్పాలని పలువురు డిమాండ్ చేశారు.

Atlee- Chinmayi: డైరెక్టర్ అట్లీ కలర్‌పై బాలీవుడ్ కమెడియన్ కామెంట్స్.. సింగర్ చిన్మయి షాకింగ్ రియాక్షన్
Director Atlee, Singer Chinmayi
Follow us
Basha Shek

|

Updated on: Dec 17, 2024 | 4:19 PM

దక్షిణాది స్టార్ దర్శకుల జాబితాలో అట్లీ కుమార్ కూడా ఒకరు. ఇప్పుడు అతనికి మస్త్ పాపులారిటీ ఉంది. షారుఖ్ ఖాన్ జవాన్ సినిమాతో బాలీవుడ్‌లోనూ మంచి పేరు తెచ్చుకున్నాడు. వరుణ్ ధావన్ తో కలిసి అట్లీ తెరకెక్కించిన బేబీ జాన్ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా కపిల్ శర్మ కామెడీ షోకు హాజరయ్యాడీ స్టార్ డైరెక్టర్. ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’లో పాల్గొన్న అట్లీకి పలు ప్రశ్నలు సంధించాడు కపిల్. అన్నిటికీ ఎంతో ఓపికగా నవ్వుతూ సమాధానం చెప్పాడీ క్రేజీ డైరెక్టర్. అదే సమయంలో స్కిన్ కలర్ ను ఉద్దేశశిస్తూ.. ‘మీరు ఎవరైనా స్టార్‌ను కలిసినప్పుడు.. మిమ్మల్ని అట్లీ ఎక్కడ అని అడిగారా’ అని కామెంట్స్ చేశాడు కపిల్ శర్మ. అయితే దీనికి అట్లీ నవ్వకుండా ఘాటుగా సమాధానం ఇచ్చాడు. ‘నువ్వు అడిగిన ప్రశ్న నాకు అర్థం అయింది. నేను సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తాను. ముందుగా ఏఆర్‌ మురుగదాస్‌కి కృతజ్ఞతలు చెప్పాలి. నా మొదటి సినిమా ఆయనే నిర్మించారు. స్క్రిప్ట్ అడిగారు. కానీ నేను ఎలా ఉన్నానో ఎప్పుడూ చూడలేదు. నా స్క్రిప్ట్ నేరేషన్ ఆయనకు బాగా నచ్చింది. ఎందుకంటే అతను నా స్క్రిప్ట్, నా సామర్థ్యం మాత్రమే చూశారు. అంతేకానీ నేను ఎలా ఉన్నానో ఆయన అడగలేదు. అక్కడ ఆయనకు నా కథ మాత్రమే నచ్చింది. ప్రపంచం అది మాత్రమే గుర్తిస్తుంది. ఒక వ్యక్తి రూపాన్ని బట్టి అంచనా వేయకూడదు. మీ మనసుతో మాత్రమే స్పందించాలి’ అని కపిల్ కు కౌంటర్ ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. దీనిపై అభిమానులు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇప్పుడు ఇదే విషయంపై సింగర్ చిన్మయి శ్రీపాద స్పందించింది. ‘‘కామెడీ పేరుతో అతని స్కిన్ కలర్ గురించి మాట్లాడడం దారుణం. ఈ విపరీతమైన హేళనలను వాళ్లు ఎప్పటికీ ఆపలేరేమో. కపిల్ శర్మ బాగా పలుకుబడి ఉన్న వ్యక్తి . అతను ఇలా కామెంట్స్ చేయడం నన్ను నిరాశపరిచింది. దురదృష్టవశాత్తూ ఆశ్చర్యం కలగక మానదు’ అని ట్వీట్ చేసింది చిన్మయి.

సింగర్ చిన్మయి ట్వీట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

డైరెక్టర్ అట్లీ కలర్‌పై కమెడియన్ కామెంట్స్.. చిన్మయి రియాక్షన్
డైరెక్టర్ అట్లీ కలర్‌పై కమెడియన్ కామెంట్స్.. చిన్మయి రియాక్షన్
చలికాలంలో ఫ్రిజ్ ఆఫ్‌ చేస్తున్నారా? భారీ నష్టం.. ఇవి తెలుసుకోండి!
చలికాలంలో ఫ్రిజ్ ఆఫ్‌ చేస్తున్నారా? భారీ నష్టం.. ఇవి తెలుసుకోండి!
ఐఫోన్ అభిమానులకు కిక్కెక్కించే న్యూస్.. త్వరలోనే ఐఫోన్ 17 ఎయిర్
ఐఫోన్ అభిమానులకు కిక్కెక్కించే న్యూస్.. త్వరలోనే ఐఫోన్ 17 ఎయిర్
స్పెర్మ్‌తో ఫేషియల్‌.! ఛీ ఛీ కాదు.. అసలు రహస్యం వేరే..!
స్పెర్మ్‌తో ఫేషియల్‌.! ఛీ ఛీ కాదు.. అసలు రహస్యం వేరే..!
వెంకన్న భక్తులకు అలెర్ట్ మార్చి నెల పలు సేవల కోటా ఈనెల 18న రిలీజ్
వెంకన్న భక్తులకు అలెర్ట్ మార్చి నెల పలు సేవల కోటా ఈనెల 18న రిలీజ్
ఇంటర్ బోర్డుకు కొత్త రూపు.. కీలక ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్
ఇంటర్ బోర్డుకు కొత్త రూపు.. కీలక ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్
చలికాలంలో తప్పకుండా తినాల్సిన ఆహారాలు ఇవే.. డోంట్ మిస్!
చలికాలంలో తప్పకుండా తినాల్సిన ఆహారాలు ఇవే.. డోంట్ మిస్!
పది పాసయ్యారా..? రెండు లక్షలు మీవే..ఎల్ఐసీ బంపర్ ఆఫర్ ఇదే..!
పది పాసయ్యారా..? రెండు లక్షలు మీవే..ఎల్ఐసీ బంపర్ ఆఫర్ ఇదే..!
పుష్ప2 జాతర సీన్ పై ట్వీట్ చేసిన నటి.. ఆడుకుంటున్న నెటిజన్స్
పుష్ప2 జాతర సీన్ పై ట్వీట్ చేసిన నటి.. ఆడుకుంటున్న నెటిజన్స్
అఖారాలు అంటే ఏమిటి? ఆదిశంకరాచార్య ఎందుకు స్థాపించారో తెలుసా..
అఖారాలు అంటే ఏమిటి? ఆదిశంకరాచార్య ఎందుకు స్థాపించారో తెలుసా..