Watch: చుట్టూ నీరు.. కొండ పైన స్వామి.! దర్శనం కోసం సాహసం చేయాల్సిందే.!

Watch: చుట్టూ నీరు.. కొండ పైన స్వామి.! దర్శనం కోసం సాహసం చేయాల్సిందే.!

Anil kumar poka

|

Updated on: Dec 17, 2024 | 3:26 PM

మన దేశంలో చాలా అరుదుగా కనిపించే ఆలయాల్లో ఇదొకటి. ఇక్కడ దత్తాత్రేయ స్వామివారిని దర్శించుకోవాలంటే.. బోటుపై ప్రయాణించాల్సిందే. ఎందుకంటే.. ఆ గుడి చుట్టూ నీరుంటుంది. ఒకప్పుడు గ్రామం మధ్య లో ఉన్న ఈ ఆలయం ఇప్పుడు నీటి మధ్యలో ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వరదవెల్లి లో కొండ పై స్వయంబుగా వెలిశారు దత్తాత్రేయ స్వామి.. ఈ అలయానికి ఎంతో చరిత్ర ఉంది.

ఈ గ్రామం మిడ్ మానేరు కింద పూర్తిగా మునిగిపోయింది. గ్రామంతో పాటు భూములన్నీ ముంపునకు గురయ్యాయి. స్వామివారు కొండ పైన కొలువై ఉండటంతో ముంపు ముప్పు బారిన పడలేదు. అయితే.. ఆలయం చుట్టూ నీరు ఉండటంతో భక్తులు స్వామి వారిని దర్శించుకోలేకపోయారు. ఎప్పుడైనా నీరు తగ్గినప్పుడు.. స్వామి వారిని దర్శించుకునేవారు. అయితే ఇప్పుడు ఆలయం చుట్టూ నీరు ఉంది. దీంతో భక్తులు వెళ్ళని పరిస్థితి. ఈ నేపథ్యంలో.. ఇటీవల ప్రభుత్వం.. మూడు బోట్ల ను ఏర్పాటు చేసింది.. బోట్ ద్వారా వెళ్లి స్వామి వారిని దర్శించుకుంటున్నారు. దర్శనానికి వెళుతున్నప్పుడు కాస్త భయపడుతున్నా.. స్వామి వారిని తలుచుకుంటూ దర్శనం చేసుకుంటున్నారు.

ప్రస్తుతం స్వామివారి జయంతి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే..ఇక్కడ బ్రిడ్జి నిర్మిస్తే.. స్వామి వారి దర్శనానికి ఎలాంటి ఆటంకాలూ ఉండవంటున్నారు భక్తులు. బోట్ ద్వారా వెళ్లి స్వామి వారిని దర్శించుకుంటున్నామని భక్తులు చెబుతున్నారు.. నీటిలో ప్రయాణం వల్ల భయంగా అనిపించినా స్వామి వారిని గుర్తు చేసుకుంటా..వెళ్తున్నామని చెప్పారు. ఇక్కడ.. ఓ వైపు ప్రకృతి..మరో వైపు ఆధ్యాత్మిక వాతావరణం.. భక్తులను ఆకట్టుకుంటుంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.