Viral: హనీమూన్‌ నుండి తిరిగి వస్తుండగా విషాదం.. కొత్త జంట మృతి.!

Viral: హనీమూన్‌ నుండి తిరిగి వస్తుండగా విషాదం.. కొత్త జంట మృతి.!

Anil kumar poka

|

Updated on: Dec 17, 2024 | 3:33 PM

తెలంగాణ నుంచి శబరిమల వెళ్తున్న బస్సును కేరళలో ఓ కారు ఢీకొంది . ఈ ప్రమాదంలో కారులోని నలుగురు మృతి చెందారు. మృతుల్లో నూతన వధూవరులు ఉన్నారు. ఈ జంట హనీమూన్‌ కు వెళ్లి వస్తుండగా పతనంతిట్ట వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు. బస్సులోని ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం.

పతనంతిట్టలో జరిగిన కారు ప్రమాదంలో మల్లాస్సేరికి చెందిన నూతన వధూవరులు అను, నిఖిల్ మృతి చెందారు. గత నవంబర్ 30న వీరి వివాహం జరిగింది. ఎనిమిదేళ్లు డేటింగ్ చేసిన తర్వాత పెళ్లి చేసుకున్నారు. హనీమూన్‌కు మలేషియా వెళ్లిన జంట తమ పర్యటన ముగించుకుని విమానాశ్రయం నుంచి తిరిగి వస్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది. ఆంధ్రా నుంచి శబరిమల యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సును వారి కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.