Anushka Shetty: బిల్లాలో నా డ్రసింగ్ చూసి మా అమ్మ చెప్పిన మాట విని షాక్ అయ్యా..!

అందాల భామ అనుష్క ప్రస్తుతం ఆచితూచి సినిమాలు చేస్తుంది. బాహుబలి సినిమా తర్వాత అనుష్క సినిమాల స్పీడ్ తగ్గించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఘాటీ అనే సినిమాతో రానుంది. ఈ సినిమాకు క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో అనుష్క డిఫరెంట్ రోల్ లో కనిపించనుంది.

Anushka Shetty: బిల్లాలో నా డ్రసింగ్ చూసి మా అమ్మ చెప్పిన మాట విని షాక్ అయ్యా..!
Anushka
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 17, 2024 | 2:59 PM

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా సక్సెస్ లతో దూసుకుపోతున్నాడు. ప్రభాస్ నటించిన సలార్ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సలార్ సినిమా అభిమానులకు ఫుల్ కిక్ ఇచ్చింది. దాదాపు ఆరేళ్ళ తర్వాత ప్రభాస్ సలార్ మూవీతో హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత కల్కి సినిమాతో మరో సంచలన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమా ఏకంగా వెయ్యికోట్లు వసూల్ చేసింది. ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉంటే ప్రభాస్ నటించిన సినిమాల్లో అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్న సినిమాలు చాలా ఉన్నాయి. వాటిలో బిల్లా మూవీ ఒకటి. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన బిల్లా మూవీ ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలుసు.

ఇది కూడా చదవండి : తస్సాదియ్యా.. కనిపెట్టండి చూద్దాం..! ఈ స్టార్ యాంకరమ్మ ఎవరో గుర్తుపట్టారా..?

బిల్లా సినిమా 1978 హిందీ చిత్రం డాన్‌కి రీమేక్‌ గా తెరకెక్కింది. ఈ సినిమాలో ప్రభాస్ డ్యూయల్ రోల్ లో కనిపించి ఆకట్టుకున్నాడు. అలాగే ఈ సినిమాలో కృష్ణం రాజు కూడా కీలక పాత్రలో నటించి మెప్పించారు. ఇక ప్రభాస్ కు జోడీగా అనుష్క నటించింది. ఈ అమ్మడితో పాటు నమిత , హన్సిక కూడా నటించారు. కాగా ఈ సినిమాలో అనుష్క తన అందాలతో ఆకట్టుకుంది. ముఖ్యంగా బికినీలో కనిపించి అందరిని షాక్ చేసింది.కాగా ఈ మూవీ గురించి అనుష్క చేసిన ఆసక్తికర కామెంట్స్ మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇది కూడా చదవండి :Pushpa 2: దొరికేసింది రోయ్..! అల్లు అర్జున్ ఫ్యాన్ గర్ల్ బయట మామూలుగాలేదుగా..!!

నిజానికి అనుష్కకు బోల్డ్ గా కనిపించడం ఇష్టం లేదట. సినిమాల్లోకి రాకముందు కేవలం సల్వార్‌ కమీజ్‌లనే ధరించేది. కాగా సినిమాల్లోకి వచ్చిన తర్వాత బిల్లా సినిమాలో మొదటి స్టార్ అంత హాట్ గా కనిపించింది. అయితే ఓ సందర్భంలో అనుష్క మాట్లాడుతూ.. నేను ఎప్పుడూ పద్దతిగా ఉండాలని మా అమ్మ అనుకుంటుంది. కానీ నన్ను బిల్లా సినిమాలో చూసిన తర్వాత ఇంకాస్త స్టైలిష్ గా కనిపించవచ్చుగా అన్నారు. సగం పద్ధతిగా, సగం మోడ్రన్‌గా ఆ డ్రెస్సులేంటి అని మా అమ్మ అన్నారు. అది విని నేను షాక్ అయ్యాను అని అనుష్క చెప్పుకొచ్చారు. ఈ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. కాగా అనుష్క ప్రస్తుతం ఆచితూచి సినిమాలు చేస్తున్నారు. చివరిగా మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి సినిమాతో హిట్ అందుకుంది. త్వరలో ఘాటీ అనే సినిమాతో రానుంది. ఈ సినిమాకు క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

బిల్లాలో నా డ్రసింగ్ చూసి మా అమ్మ చెప్పిన మాట విని షాక్ అయ్యా..!
బిల్లాలో నా డ్రసింగ్ చూసి మా అమ్మ చెప్పిన మాట విని షాక్ అయ్యా..!
ప్రభాస్ సినిమాకు నో చెప్పిన ఆ క్రేజీ హీరోయిన్! కారణమేంటో తెలుసా?
ప్రభాస్ సినిమాకు నో చెప్పిన ఆ క్రేజీ హీరోయిన్! కారణమేంటో తెలుసా?
దుబాయ్‌లో డెలివరీ బాయ్స్‌ ఉద్యోగాలకు హైదరాబాద్‌లో ఇంటర్వ్యూలు
దుబాయ్‌లో డెలివరీ బాయ్స్‌ ఉద్యోగాలకు హైదరాబాద్‌లో ఇంటర్వ్యూలు
మళ్ళీ ప్లేగు వ్యాధి వ్యాప్తి సహా నోస్ట్రాడమస్ అంచనాలు ఏమిటంటే..
మళ్ళీ ప్లేగు వ్యాధి వ్యాప్తి సహా నోస్ట్రాడమస్ అంచనాలు ఏమిటంటే..
రైతులకు సులువుగా రుణాలు.. రూ.1000 కోట్లతో రుణ హామీ పథకం
రైతులకు సులువుగా రుణాలు.. రూ.1000 కోట్లతో రుణ హామీ పథకం
లీకు రాయుళ్ల పైత్యం.. స్కూల్‌ పిల్లల SA 1 మ్యాథ్స్‌ పేపర్ లీక్!
లీకు రాయుళ్ల పైత్యం.. స్కూల్‌ పిల్లల SA 1 మ్యాథ్స్‌ పేపర్ లీక్!
నవ్వు ఆపుకోలేరు..! పెళ్లి మండపంలోనే మరదలితో సరసాలాడిన వరుడు..
నవ్వు ఆపుకోలేరు..! పెళ్లి మండపంలోనే మరదలితో సరసాలాడిన వరుడు..
వామ్మో ఈ పాడు ఎలుకులు ఎంత పని చేశాయి..
వామ్మో ఈ పాడు ఎలుకులు ఎంత పని చేశాయి..
ఒక్క ముద్దు.. ఆమెకు మృత్యువు ముంచుకొచ్చేలా చేసింది..!ఏం జరిగిదంటే
ఒక్క ముద్దు.. ఆమెకు మృత్యువు ముంచుకొచ్చేలా చేసింది..!ఏం జరిగిదంటే
బిడ్డ పుట్టిందని ఆటో డ్రైవర్ల‌కు ఊహించని గిఫ్ట్
బిడ్డ పుట్టిందని ఆటో డ్రైవర్ల‌కు ఊహించని గిఫ్ట్