Manchu Manoj: మంచు ఫ్యామిలీ గొడవలో మరో ట్విస్ట్.. మనోజ్ ఫిర్యాదుపై తల్లి నిర్మల షాకింగ్ కామెంట్స్..
గత కొన్ని రోజులుగా మంచు ఫ్యామిలీలో నెలకొన్న వివాదం రచ్చకెక్కిన సంగతి తెలిసిందే. మంచు మోహన్ బాబు, మనోజ్, విష్ణు మధ్య తీవ్రస్థాయిలో గొడవలు జరుగుతున్నాయి. తాజాగా ఈ ఫ్యామిలీ వివాదం పై మోహన్ బాబు భార్య నిర్మల స్పందించారు.
మంచు ఫ్యామిలీ గొడవల్లో ట్విస్టుల మీద ట్విస్ట్‌లు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా తెరపైకి వచ్చిన వివాదంలో మనోజ్ చెబుతోంది అబద్ధమంటూ తల్లి నిర్మల క్లారిటీ ఇచ్చారు. ఆదివారం ఇంట్లో విష్ణు ఎలాంటి గొడవ చేయలేదంటూ స్పష్టం చేశారు. పహాడీ షరీఫ్ పోలీసులకు మోహన్‌బాబు భార్య నిర్మలాదేవి లేఖ రాశారు. తన పుట్టిన రోజు ఎలాంటి గొడవ జరగలేదంటూ అందులో చెప్పుకొచ్చారు. ఆరోజు ఇంట్లోని జనరేటర్‌లో విష్ణు పంచదార పోశారంటూ మనోజ్ చేసిన ఆరోపణలను తల్లి నిర్మల ఖండించారు.
తన పుట్టినరోజున కేక్ తీసుకుని సెలబ్రేట్ చేసేందుకే విష్ణు వచ్చాడని, కేక్ కట్ చేశాక తన సామాన్లు మాత్రమే తీసుకుని వెళ్లాడని చెప్పారు నిర్మాల దేవి. చిన్న కొడుకు మనోజ్‌కి ఇంట్లో ఎంత హక్కు ఉందో.. పెద్ద కొడుకు విష్ణుకి కూడా అంతే హక్కు ఉందన్నారు నిర్మల. విష్ణు ఎలాంటి దౌర్జన్యం చేయలేదని స్పష్టంగా చెప్పారు. ఇంట్లో పనివాళ్లు మానేయడానికి విష్ణు కారణం కాదని వాళ్లే పనిచేయలేమని మానేశారు అంటూ వివరణ ఇచ్చారు నిర్మలదేవి.
డిసెంబర్ 8 ఆదివారం మంచు కుటుంబంలో విభేదాలు రోడ్డున పడిన సంగతి తెలిసిందే. తండ్రి మోహన్‌బాబు.. చిన్న కొడుకు మనోజ్ మధ్య మాటామాటా పెరిగి.. తోపులాటలకు దారి తీసి చివరికి కేసులు పెట్టుకునే వరకూ వెళ్లింది. ఈ వివాదాన్ని కవర్ చేసేందుకు వెళ్లిన టీవీ9 రిపోర్టర్ సహా మిగతా మీడియాపై మోహన్‌బాబు దాడితో వివాదం ఇంకా పెద్దదైంది. పరస్పరం దాడులు, మాటల యుద్ధంతో విష్ణు, మనోజ్ రగిలిపోయారు. ఇదిలా కొనసాగుతుండగానే 14వ తేదీన, అంటే గత శనివారం తల్లి నిర్మల బర్త్‌డే సందర్భంగా మనోజ్, విష్ణు మళ్లీ గొడవ పడ్డారనే వార్తలు చర్చనీయాంశం అయ్యాయి. ఆరోజు జనరేటర్‌లో పంచదార పోయడం ద్వారా కరెంట్ లేకుండా చేశారని మనోజ్ తన అన్న విష్ణుపై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
ఇది చదవండి : Bigg Boss 8 Telugu: ముగిసిన ఓటింగ్.. బిగ్‌బాస్ విన్నర్ అతడేనా.. ఊహించని రిజల్ట్స్..
Tollywood: ఏందీ గురూ.. ఈ హీరోయిన్ ఇట్టా మారిపోయింది.. అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు గ్లామర్ క్వీన్‌గా..
Tollywood: ప్రియుడితో పెళ్లి.. ఐదు నెలలకే ప్రెగ్నెన్సీ.. ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన హీరోయిన్..
Tollywood: ఈ అమ్మాయి గాత్రానికీ ఫిదా అవ్వాల్సిందే.. హీరోయిన్స్‌ను మించిన అందం.. ఎవరంటే..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.