AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LIC Bima Sakhi: పది పాసయ్యారా..? రెండు లక్షలు మీవే.. ఎల్ఐసీ అందిస్తున్న సువర్ణావకాశం ఇదే

దేశంలోని ప్రతి ఒక్కరికీ బీమా అనేది అత్యవసరం. ఆపద సమయంలో కుటుంబం రోడ్డున పడకుండా ఆర్థిక భరోసా కల్పిస్తుంది. అనుకోని నష్టం కలిగినప్పుడు అండగా నిలుస్తుంది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన మన దేశంలో బీమా రంగానికి ఎంతో ప్రాధాన్య ముంది. ఈ నేపథ్యంలో ఈ రంగంలో మహిళకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది.

LIC Bima Sakhi: పది పాసయ్యారా..? రెండు లక్షలు మీవే.. ఎల్ఐసీ అందిస్తున్న సువర్ణావకాశం ఇదే
Lic Policy
Nikhil
|

Updated on: Dec 17, 2024 | 4:00 PM

Share

ఎల్‌ఐసీ బీమా సఖి (ఎంసీఏ) యోజన అనే పథకాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. మహిళలను ఉపాధి కల్పించడమే ఈ పథకం ప్రధాన లక్ష్యం. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఎల్‌ఐసీ బీమా సఖి పథకాన్ని తీసుకువచ్చారు. పదో తరగతి ఉత్తీర్ణులై, 18 ఏళ్ల నుంచి 70 మధ్య వయసున్న మహిళలందరూ దీనికి అర్హులే. వీరికి ఎల్‌ఐసీ ఏజెంట్లుగా మూడేళ్ల పాటు శిక్షణ ఇస్తారు. ఈ సమయంలో ప్రతినెలా కొంత మొత్తం చెల్లిస్తారు. బీమా సఖిగా ఎంపికైన మహిళలు తమ ప్రాంతంలో ఎల్‌ఐసీ ఏజెంట్లుగా పనిచేయాలి. ఎల్‌ఐసీ బీమా సభిగా ఎంపికైన మహిళలకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. వీరు మూడేళ్ల పాటు పనిచేయాల్సి ఉంటుంది. ఈ సమయంలో రూ.2 లక్షలకు పైగా సంపాదించుకునే అవకాశం లభిస్తుంది. మొదటి ఏడాది నెలకు 7 వేలు, రెండో ఏడాది రూ.6 వేలు, మూడో ఏడాది రూ.5 వేలు చొప్పున అందజేస్తారు. బోనస్‌ లు, కమీషన్లు వంటివి మాత్రం ఇవ్వరు. అయితే వీరు విక్రయించే పాలసీలో 65 శాతం వచ్చే ఏడాది చివరి వరకూ యాక్టివ్‌ గా ఉండాలనే నిబంధన మాత్రం ఉంది.

బీమా సఖిగా మూడేళ్లు శిక్షణ పూర్తయిన అనంతరం ఆ మహిళలను ఎల్‌ఐసీ ఏజెంట్లుగా నియమిస్తారు. వీరిలో గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసిన వారికి ఎల్‌ఐసీ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌గా అవకాశం కూడా లభిస్తుంది. బీమా సఖి మొదటి ఏడాది వంద పాలసీలను విక్రయిస్తే, రెండో ఏడాదికి వాటిలో 65 శాతం యాక్టివ్‌గా ఉండాలి. ఏజెంట్లు పాలసీలను విక్రయించడంతో పాటు నిలుపుకోవడానికి కూడా కృషి చేయాలి. అయితే బీమా సఖి అనేది జీతంతో కూడిన ఉద్యోగం కాదు. ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి కొందరిని అనర్హులుగా ప్రకటించారు. ఇప్పటికే ఎల్‌ఐసీ ఏజెంట్‌గా ఉన్న వ్యక్తి, ఉద్యోగికి సంబంధించిన బంధువులు దరఖాస్తు చేసుకోకూడదు. అంటే అతడి భార్య, పిల్లలు, దత్తత పిల్లలు, తల్లిదండ్రులు, సోదరులు, సోదరీమణులు, అత్తమావలకు అవకాశం లేదు.

కార్పొరేషన్‌లో ఉద్యోగ విరమణ చేసిన వ్యక్తి, రీఅపాయింట్‌మెంట్‌ కోరుకునే మాజీ ఏజెంట్‌ అనర్హుడు. ప్రస్తుతం ఎల్‌ఐసీ ఏజెంట్‌గా పనిచేస్తున్న వారికి కూడా అవకాశం లేదు. ఆసక్తి, అర్హత ఉన్నవారు ఎల్ఐసీ అధికారిక వెబ్‌సైట్‌ లోకి వెళ్లాలి. వయసు, చిరునామా, విద్యార్హత ప్రతాలను అప్‌లోడ్‌ చేయాలి. అలాగే ఇమెయిల్‌ ఐడీ, ఇతర వివరాలు ఎంటర్‌ చేయాలి. చివరిగా క్యాప్చా కోడ్‌ నమోదు చేసి దరఖాస్తును సబ్మిట్‌ చేయాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి