AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Iphone 17 Air: ఐఫోన్ అభిమానులకు కిక్కెక్కించే న్యూస్.. త్వరలోనే ఐఫోన్ 17 ఎయిర్ విడుదల

ఆపిల్ కంపెనీ తయారు చేసే ఐఫోన్లకు ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన డిమాండ్ ఉంది. వివిధ బ్రాండ్లకు చెందిన ఎన్ని ఫోన్లు విడుదలైనప్పటికీ ఐఫోన్ కు ఉండే క్రేజ్ అసలు తగ్గదు. వినియోగదారుల అవసరాలకు తగినట్టుగానే ఆపిల్ కంపెనీ నుంచి కొత్త ఫీచర్లు, ప్రత్యేకతలతో ఫోన్లు విడుదలవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆపిల్ కస్టమర్లకు ఒక శుభవార్త అందింది. ఐఫోన్ 17 ఎయిర్ ఉత్పత్తి దశకు చేరుకుందని, వచ్చే ఏడాది మార్కెట్లోకి విడుదల అవుతుందని దాని సారాంశం.

Iphone 17 Air: ఐఫోన్ అభిమానులకు కిక్కెక్కించే న్యూస్.. త్వరలోనే ఐఫోన్ 17 ఎయిర్ విడుదల
Iphone 17 Air
Nikhil
|

Updated on: Dec 17, 2024 | 4:15 PM

Share

ఆపిల్ కంపెనీకి చెందిన ఐఫోన్ 17 ఉత్పత్తి దశకు చేరుకుంది. దీనిలో ఈఎస్ఐఎం టెక్నాలజీ వినియోగించారు. సన్నని డిజైన్, ఒకే కెమెరా, తక్కువ బ్యాటరీ పరిమాణంలో విడుదల కానుంది. ఆపిల్ కంపెనీ తన తయారీ భాగస్వామి అయిన ఫాక్స్ కాన్ తో కలిసి భారీగా ఫోన్లను ఉత్పత్తి చేయనుంది. కొత్త ఐఫోన్ 17 ఎయిర్ ఫోన్ అత్యాధునిక సాంకేతికత, మంచి డిజైన్ తో వస్తుందని భావిస్తున్నారు. ఆపిల్ కంపెనీకి చెందిన అత్యంత సన్నని ఐఫోన్ ఇదేనని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఈఎస్ఐఎం టెక్నాలజీ, సింగిల్ కెమెరా, సరికొత్త ఫీచర్లతో మార్కెట్ లోకి విడుదల కానుంది.

ఐఫోన్ 17 ఎయిర్ మోడల్ ప్రస్తుతం ఫాక్స్ కాన్ లో కొత్త ఉత్పత్తి పరిచయం (ఎన్పీఐ) అనే దశకు చేరుకుంది. అంటే కాన్సెప్ట్ స్థాయి నుంచి భారీ ఉత్పత్తి దశకు చేరుకుందని అర్థం. ముందుగా డిజైన్ స్థాయి నుంచి మోడల్ ను పరిశీలిస్తారు. అనంతరం వివిధ దశలలో పరీక్షలు జరిపి, చివరకు ఉత్పత్తిని ప్రారంభిస్తారు. ఐఫోన్ 17 సిరీస్ లో భాగంగా ఎయిర్ ఫోన్ ను విడుదల చేస్తారని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. ఈ సిరీస్ లో ఐఫోన్ 17, ఐఫోన్ 17 ఎయిర్, ఐఫోన్ 17ప్రో, ఐఫోన్ 17 ప్రో మాక్స్ ఉంటాయని అంచనా. ఐఫోన్ 17 ఎయిర్ లో ఉండే వివిధ ఫీచర్ల గురించి రకరకాల వార్తలు వస్తున్నాయి. ఎక్కువ మంది చెప్పిన వివరాల ప్రకారం.. ఈ ఫోన్ చాాలా సన్నగా ఉంటుంది. దాని కోసం యాపిల్ ఫిజికల్ సిమ్ కార్డు ట్రేను తీసివేయవచ్చు. ఇది ఈఎస్ఐమ్ టెక్నాలజీపై ఆధారపడి పనిచేస్తుంది. ఇప్పటికే విడుదలైన మోడళ్లతో పోల్చితే దీని బ్యాటరీ చిన్నగా ఉంటుంది.

ఐఫోన్ 17 ఎయిర్ లో ఏ19 చిప్ సెట్ ఏర్పాటు చేశారని, దీని మందం 5 నుంచి 6 మిల్లీమీటర్లు మాత్రమే ఉంటుందని అంచనా. 48 ఎంపీ ప్రధాన కెమెరా, 24 ఎంపీ ఫ్రంట్ కెమెరాలను అమర్చే అవకాశం ఉంది. ఆపిల్ సొంతంగా రూపొందించిన 5జీ మోడెమ్ చిప్ సెట్ ను దీనిలో ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఐఫోన్ ధరలు సాధారణ ఫోన్లతో పోల్చితే ఎక్కువగానే ఉంటాయి. అయితే వాటి నాణ్యత, పనితీరు, ఫీచర్లు కారణంగా ఈ ధర తక్కువే అనిపిస్తుంది. అందుకే ఈ ఫోన్ ను కొనుగోలు చేయడానికి వినియోగదారులు ఎగబడతారు. ప్రస్తుతం వార్తల్లో నిలిచిన ఐఫోన్ 17 ఎయిర్ ధర మన దేశంలో రూ.90 వేలు ఉండవచ్చని భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి