Tech Tips: శీతాకాలంలో రిఫ్రిజిరేటర్‌ను ఆఫ్ చేస్తున్నారా? భారీ నష్టం.. ఇవి తెలుసుకోండి!
Rrefrigerator Tips: ప్రతి ఒక్కరి ఇళ్లలో రిఫ్రిజిరేటర్ ఉంటుంది. ఎండాకాలంలో అధికంగా వాడుతాం. కానీ చలికాలంలో పెద్దగా అవసరం లేదని భావిస్తుంటారు. ఈ కాలంలో చాలామంది ఫ్రిజ్‌లను ఆఫ్ చేస్తుంటారు. కానీ అలా చేయడం మీకు నష్టమనే విషయం తెలుసుకోవడం చాలా ముఖ్యం..
![Tech Tips: శీతాకాలంలో రిఫ్రిజిరేటర్‌ను ఆఫ్ చేస్తున్నారా? భారీ నష్టం.. ఇవి తెలుసుకోండి!](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/09/best-refrigerators.jpg?w=1280)
Tech Tips: చలి కాలం కొనసాగుతోంది. రోజురోజుకు చలి తీవ్రత పెరిగిపోతోంది. ఈ కాలంలో రిఫ్రిజిరేటర్ ఉపయోగం గురించి చాలా సందేహాలు తలెత్తుతాయి. వేసవిలో మనం ఫ్రిజ్‌ని విరివిగా ఉపయోగిస్తాము. కానీ చలికాలంలో చాలా మంది ఫ్రిజ్‌ను వాడటం తగ్గించడం లేదా పూర్తిగా స్విచ్ ఆఫ్ చేయడం చేస్తుంటారు. చలికాలంలో కూడా రిఫ్రిజిరేటర్‌ను ఆఫ్ చేస్తే కరెంటు ఆదా అవుతుందని, రిఫ్రిజిరేటర్‌లో ఉంచిన వస్తువులు చెడిపోకుండా ఉంటాయని భావిస్తుంటారు. అయితే మనం నిజంగా శీతాకాలంలో ఫ్రిజ్‌ని ఆఫ్ చేయాలా? వద్దా తెలుసుకుందాం.
కూరగాయలను తాజాగా ఉంచడానికి, చల్లటి నీటిని, అనేక ఆహార పదార్థాలను నిల్వ చేయడానికి రిఫ్రిజిరేటర్‌ని ఉపయోగిస్తాము. రిఫ్రిజిరేటర్ ఆహార పదార్థాలను బ్యాక్టీరియా నుండి సురక్షితంగా ఉంచుతుంది. ఇది కాకుండా, రిఫ్రిజిరేటర్‌లో రెండు వేర్వేరు కంపార్ట్‌మెంట్లు ఉంటాయి. ఇవి వేర్వేరు ఉష్ణోగ్రతలను కలిగి ఉంటాయి.
మీరు రిఫ్రిజిరేటర్‌ను ఆఫ్ చేస్తే ఏమవుతుంది?
మీకు పాత రిఫ్రిజిరేటర్‌ని ఉంటే మీరు దాని ఉష్ణోగ్రతను తగ్గించినప్పటికీ, దాని నిర్వహణ కొనసాగించడం ముఖ్యం. ఫ్రిజ్‌ను ఎక్కువసేపు మూసి ఉంచడం వల్ల అది పనిచేయకపోవచ్చు. పాత రిఫ్రిజిరేటర్లలో కంప్రెసర్ జామింగ్ అవకాశం పెరుగుతుంది. మరోవైపు మీ వద్ద కొత్త ఫ్రిజ్‌ని ఉంటే చింతించకుండా ఉండవచ్చు. ఎందుకంటే కొత్త ఫ్రిజ్ ఉష్ణోగ్రతకు అనుగుణంగా స్వయంచాలకంగా సర్దుబాటు అవుతుంది. శీతాకాలంలో రిఫ్రిజిరేటర్ కంప్రెసర్ తక్కువ కష్టపడి పనిచేయవలసి ఉంటుంది. దీని కారణంగా విద్యుత్ వినియోగం కూడా తగ్గుతుంది. దీనికి విరుద్ధంగా వేసవిలో కంప్రెసర్ కష్టపడి పనిచేయవలసి ఉంటుంది. దీని కారణంగా విద్యుత్ వినియోగం పెరుగుతుంది.
ఏం చేయాలి?
శీతాకాలంలో ఫ్రీజర్‌ని స్విచ్ ఆఫ్ చేయడానికి బదులుగా దాని ఉష్ణోగ్రతను తగ్గించడం ఉత్తమం. దీని వల్ల ఫ్రిజ్ సక్రమంగా పని చేయడంతోపాటు విద్యుత్ ఆదా అవుతుంది. ముఖ్యంగా పాత ఫ్రిజ్‌ని స్విచ్ ఆఫ్ చేయడం దాని సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది. అందువల్ల రిఫ్రిజిరేటర్‌ను సరిగ్గా ఉపయోగించుకోండి. ఆహార పదార్థాలను సురక్షితంగా ఉంచండి.
శీతాకాలంలో..
శీతాకాలంలో రిఫ్రిజిరేటర్‌ను 2°C నుండి 5°C (35°F నుండి 41°F) మోడ్‌కి సెట్ చేయడం ఉత్తమం. ఎందుకంటే ఈ మోడ్ కూరగాయలు, ఆహారాన్ని సురక్షితంగా ఉంచడానికి తగినంత చల్లగా ఉంటుంది. శీతాకాలంలో బయటి చలి కారణంగా రిఫ్రిజిరేటర్ ఉష్ణోగ్రత తక్కువగా సెట్ చేయవలసిన అవసరం లేదు.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి