AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Apple iPhone 17 సిరీస్‌లో కొత్త మోడల్‌.. లాంచ్ చేయడానికి ముందు ఫీచర్స్‌, ధర లీక్‌..!

Apple iPhone 17: దేశంలో రకరకాల స్మార్ట్‌ ఫోన్లు విడుదలవుతున్నాయి. అత్యాధునిక ఫీచర్స్‌ను జోడిస్తూ ఫోన్‌లను మార్కెట్లోకి వదులుతున్నాయి. ఇక యాపిల్‌ నుంచి ఐఫోన్‌ గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఫోన్‌కు ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. ఇప్పుడు ఐఫోన్‌ 17పై అందరికి దృష్టి ఉంది..

Apple iPhone 17 సిరీస్‌లో కొత్త మోడల్‌.. లాంచ్ చేయడానికి ముందు ఫీచర్స్‌, ధర లీక్‌..!
Subhash Goud
|

Updated on: Dec 17, 2024 | 6:29 PM

Share

Apple iPhone 17: ఐఫోన్ 16 సిరీస్ తర్వాత యాపిల్ ఇప్పుడు ఐఫోన్ 17 సిరీస్‌ను లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. ఈసారి కంపెనీ తన సిరీస్‌లో ప్లస్ మోడల్‌కు బదులుగా ఎయిర్ వెర్షన్‌ను తీసుకురావచ్చని భావిస్తున్నారు. Apple iPhone 17 Plusని iPhone 17 Airతో భర్తీ చేస్తుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీని మందం 5-6mm ఉండవచ్చు. ఇంతకుముందు దీని ధర ప్రో మోడల్స్ కంటే ఎక్కువగా ఉండవచ్చని నివేదికలు వచ్చాయి. అయితే ఇది జరగదని తాజా సమాచారం వచ్చింది. ఎయిర్ మోడల్ ధర ప్రో మోడల్ కంటే తక్కువగా ఉండే అవకాశం ఉంది.

iPhone 17 Airలో ఏ ఫీచర్లు?

Apple iPhone 17 Airకి పూర్తిగా సొగసైన, కొత్త రూపాన్ని ఇవ్వగలదని అంచనాలు ఉన్నాయి. దీనికి టైటానియం ఫ్రేమ్ ఇవ్వవచ్చని లీకుల ద్వారా తెలుస్తోంది. తద్వారా దాని బరువు తక్కువగా ఉంటుందని, ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.6 అంగుళాల సూపర్ రెటినా XDR OLED డిస్‌ప్లేను పొందవచ్చని తెలుస్తోంది. ఇది Apple కొత్త A19 చిప్‌సెట్‌తో అమర్చబడి ఉంటుందని, ఇది దాని పనితీరు, శక్తి సామర్థ్యాన్ని పెంచడంలో సహాయపడుతుంది. కెమెరా గురించి మాట్లాడినట్లయితే.. ఇది 48MP ప్రైమరీ సెన్సార్, 24MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంటుందని టెక్‌ నిపుణులు భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఐఫోన్ 17 ఎయిర్ ధర ఎంత ఉండవచ్చు?

తాజా లీకవుతున్న నివేదికల ప్రకారం.. ఐఫోన్ 17 ఎయిర్ ధర ప్లస్ వేరియంట్ మాదిరిగానే ఉండవచ్చని టెక్‌ నిపుణులు భావిస్తున్నారు. ప్రో వెర్షన్‌తో పోలిస్తే కొత్త మోడల్ సరసమైన వేరియంట్‌గా ఉండవచ్చు. దాని ధరను తక్కువగా ఉంచడానికి, కంపెనీ దాని కొన్ని ఫీచర్స్‌పై రాజీ పడవచ్చు. దీని ధర దాదాపు ఐఫోన్ 16 ప్లస్‌తో సమానంగా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం భారతదేశంలో ఐఫోన్ 16 ప్లస్ ధర సుమారు రూ. 80,000 నుండి ప్రారంభమవుతుంది. దీని ఆధారంగా, iPhone 17 Air ధర నిర్ణయించే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఈ ఫోన్ వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. అయితే దీనిపై ఇప్పటి వరకు కంపెనీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

ఇది కూడా చదవండి: Fact Check: ఒక వ్యక్తికి రెండు బ్యాంకు ఖాతాలు ఉంటే జరిమానా చెల్లించాలా? ఆర్బీఐ కొత్త రూల్స్‌ నిజమేనా?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఈ నోబెల్ గ్రహీత ఫార్ములా తెలిస్తే.. బతకడం చాలా తేలిక
ఈ నోబెల్ గ్రహీత ఫార్ములా తెలిస్తే.. బతకడం చాలా తేలిక
ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు