Sindhu Menon: ఓరి దేవుడా..! చందమామ హీరోయిన్ ఏంటి ఇలా మారిపోయింది.. అస్సలు గుర్తుపట్టలేం గురూ..
ఇలా వచ్చి పోయిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. ఆ లిస్ట్ లో ఈ బ్యూటీ కూడా ఒకరు. ఆమె పేరు సింధు మీనన్. ఈ బ్యూటీ వైశాలి సినిమాతో ప్రేక్షకులను అలరించింది. అది పినిశెట్టి హీరోగా వచ్చిన ఈ సినిమా తమిళ్ డబ్.
ఇలా వచ్చి అలా వెళ్ళిపోయినా హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. అర్రే ఈ హీరోయిన్ చాలా బాగుందే అనుకునేలోగా ఆమె నెక్స్ట్ మరో సినిమాలో కనిపించదు. ఇలా వచ్చి పోయిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. ఆ లిస్ట్ లో ఈ బ్యూటీ కూడా ఒకరు. ఆమె పేరు సింధు మీనన్. ఈ బ్యూటీ వైశాలి సినిమాతో ప్రేక్షకులను అలరించింది. అది పినిశెట్టి హీరోగా వచ్చిన ఈ సినిమా తమిళ్ డబ్. అంతకు ముందు 15 సంవత్సరాల వయసులో తెలుగు లో భద్రాచలం అనే సినిమాలో నటించింది. ఆ తర్వాత ఈమె నటించిన సినిమా చందమామ సూపర్ హిట్ అయ్యింది. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. అలాగే సెకండ్ హీరోయిన్ గా సింధు మీనన్ నటించింది. చందమామ సినిమాలో అల్లరి పిల్లగా సింధు నటన ప్రేక్షకులను మెప్పించింది.
ఆ తర్వాత సింధు మీనన్ సినిమాలకు దూరం అయ్యింది. ఈ మూవీ తర్వాత ఒకటి రెండు సినిమాలు చేసినప్పటికీ అవి పెద్దగా ప్రేక్షకులను మెప్పించలేదు. దాంతో ఈ బ్యూటీ కనుమరుగైంది. ఇక ఇప్పుడు ఈ చిన్నది ఎక్కడ ఉంది. ఎలా ఉంది అంటూ గూగుల్ లో గాలిస్తున్నారు నెటిజన్లు.
సింధు యూకే లో స్థిరపడ్డ తెలుగు కుటుంబానికి చెందిన డొమినిక్ ప్రభు అనే ఐటీ ఎంప్లాయ్ ని ఏప్రిల్ 2010న వివాహం చేసుకుంది. వీరికి ఓ కూతురు కూడా ఉంది పేరు స్వెత్లానా. పెళ్లితర్వాత సింధు పూర్తిగా సినిమాలకు దూరం అయ్యింది. ప్రస్తుతం ఆమె తన ఫ్యామిలీ తో హ్యాపీగా గడుపుతోంది.
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి