Silk Smitha: నిషా కళ్ల మయూరం సిల్క్ స్మిత సూసైడ్ నోట్ చదవితే కన్నీళ్లు ఆగవు..

సిల్క్ జీవితం ఆధారంగానే ఏక్తాకపూర్ ‘ద డర్టీ పిక్చర్’ నిర్మించారు. సిల్క్ జయంతి సందర్భంగా 2011 డిసెంబర్ 2న ఈ చిత్రాన్ని విడుదల చేయగా సంచలన విజయం సాధించింది.

Silk Smitha: నిషా కళ్ల మయూరం సిల్క్ స్మిత సూసైడ్ నోట్ చదవితే కన్నీళ్లు ఆగవు..
Silk Smitha
Follow us

|

Updated on: Jan 28, 2023 | 10:09 AM

సిల్క్ స్మిత.. వెండితెరపై వెలుగు జిలుగులు చిమ్మిన తార. 36 ఏళ్ళకే అర్ధాంతరంగా రాలిపోయిన సినీ సితార. ఆమె మనసులను ఆకర్షించే అయస్కాంతం. మత్తెక్కించే కళ్లు.. మైమరించినే మేని ఛాయ. ఐటమ్ గాళ్‌ మాత్రమే కాదు ఆమె లేడీ సూపర్ స్టార్. టాప్ హీరోలు సినిమాలు తీసి.. కూడా ఒక్క పాట చేయమని సిల్క్‌ను వెంటపడేవారు. విడుదలకు నోచుకోని సినిమాలకు.. ఆమె పాటే ప్రమోషన్.  మత్తు కళ్ళతో.. కవ్వించే అందాలతో.. అప్పట్లో యువకులను చిత్తు చేసిన సిల్క్ స్మితది నిజజీవితంలో పసిపిల్ల మనస్తత్వం.

సిల్క్ స్మిత పూర్తి పేరు మీకు తెలుసా..? వడ్లపట్ల విజయలక్ష్మి. మన ఏలూరు తాలూకా అమ్మాయే.  1960 డిసెంబర్ 2న దెందులూరు మండలం కొవ్వలిలో ఆమె జన్మించారు. నాల్గవ తరగతి వరకే చదవుకున్నారు. పదిహేనేళ్ళకే ఆమెను ఒక అయ్య చేతిలో పెట్టేశారు తల్లిదండ్రులు. ఆమె భర్త, అత్తమామలు వేధింపులకు గురి చేయడంతో… ఇల్లు వదలి పారిపోయింది విజయలక్ష్మి. మద్రాస్ వచ్చి.. తొలుత టచప్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించి.. చిన్నా చితకా పాత్రలు చేస్తోన్న ఆమెను.. మలయాళం డైరెక్టర్ ఆంథోనీ ఈస్ట్ మన్  ‘ఇనయే తేడి’ సినిమాలో హీరోయిన్‌ను చేశాడు. ఆ తరువాత ‘వండిచక్రం’ తమిళ సినిమాతో సిల్క్ స్మిత అయ్యింది. జ్యోతిలక్ష్మి, జయమాలిని ఇండస్ట్రీని శాసిస్తున్న ఆ రోజుల్లో దూసుకొచ్చి శృంగార రసాధిదేవతగా ప్రేక్షకుల మనసులు కొల్లగొట్టిన కెరటం సిల్క్ స్మిత. తమిళ ప్రేక్షకులు ఆమెను సిల్క్ అనే పిలుస్తారు.  అప్పటి టాప్ హీరోస్ అందరి చిత్రాలలోనూ సిల్క్ స్మిత ఆడిపాడింది. తెలుగుతో పాటు తమిళ, మళయాళ, కన్నడ చిత్రాలలోనూ సిల్క్ స్మిత  సత్తా చాటింది.

అభిమాన నటీనటుల ఆటోగ్రాఫ్ తీసుకునే అలవాటుకు భిన్నంగా సిల్క్ స్మిత విషయంలో తమిళ ఫాన్స్ ప్రవర్తించేవారు. ఒక కిళ్ళీ తెచ్చుకొని ఆమెను కొరికి ఇమ్మని బతిమాలుకోవటం అప్పట్లో ఒక ట్రెండ్. 1984 లో ఒక సారి షూట్ బ్రేక్ లో యాపిల్ తింటూ ఉండగా షాట్ రెడీ అని పిలుపొచ్చింది. సగం కొరికిన యాపిల్ అక్కడే వదిలేసి వెళ్ళిపోయింది. ఆ కొరికిన యాపిల్‌ను ఆమె మేకప్ మన్ అక్కడికక్కడే వేలం వేస్తే సెట్లో ఉన్నవాళ్ళు పోటీపడి 26 వేలకు కొనుక్కోవటమంటే మాటలా… ?

వెండితెరపై ఓ వెలుగు వెలిగిన సిల్మ్ స్కిత్ 1996 సెప్టెంబర్ 23న సిల్క్ స్మిత ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె మరణంపై ఎన్నో అనుమానాలు వ్యక్తమయ్యాయి. పోలీసులు స్వాధీనం చేసుకున్న ఆమె సూసైడ్ నోట్‌లో ఉన్న కంటెంట్.. మీ కోసం…

“అభాగ్యురాలు 22/9/1996. దేవుడా, నా 7వ సంవత్సరం నుంచి నా పొట్టకి కష్టపడ్డాను. నాకు నావారు అంటూ ఎవరూ లేరు. నేను నమ్మిన వారు నన్ను మోసం చేసారు. బాబు తప్ప నామీద ఎవరు ప్రేమ చూపలేదు. ఎవ్వరికీ నామీద ప్రేమలేదు. బాబు తప్పితే అందరూ నా కష్టం తిన్నవారే. నా నాశనం కోరారు. ఎవ్వరికీ విశ్వాసం లేదు. జీవితంలో నాకు అందరిలాగే కోరికలు ఉన్నాయి. కానీ నాచుట్టూ ఉన్నవాళ్లు నాకు మనశాంతి లేకుండా చచ్చిపోయేట్లు చేశారు. ఇంత సాధించినా నాకు మనశాంతి లేకుండా చేశారు. అందరికి మంచి చేశాను. కానీ నా జీవితం ఇలా చేశారు. ఏమి న్యాయమిది. నాకు ఉన్న ఏ కొంచెమైనా బాబు కుటుంబానికి, నా కుటుంబానికి పంచవలెను. నా ఆశలన్నీ ఒకరిమీద పెట్టుకున్న . అతను నన్ను మోసం చేసాడు. దేవుడుంటే వాణ్ణి చూసుకుంటాడు. రోజు టార్చర్ నేను భరించలేను. నాకప్పుడు ఏది న్యాయమనిపిస్తే అదే చేసాను. ఒకసారి నేను నగ కొనుక్కుంటే పెట్టుకోనివ్వలేదు. ఇప్పుడు ఇష్టముంటే నేనుండను. దేవుడు నన్ను వేషం కోసం పుట్టించాడు. నేను ఎంతోమందికి మంచి చేసినా వంచన చేశారు. దేవుడుంటే చూసుకుంటాడు . నా రెక్కల కష్టం తినని వారు లేరు. అయినా ఎవరికి విశ్వాసం లేదు, బాబుకి తప్ప. నాకు ఒకడు 5 సంవత్సరాల క్రితం జీవితం ఇస్తానన్నాడు. ఇప్పుడు ఇవ్వనంటున్నాడు. నా జీవితంలో ఎంతో భరించాను. కానీ ఇది నావల్ల కావడం లేదు. ఇది రాయడానికి ఎంత నరకం పడ్డానో నాకే తెలియును.”

Silk

ఇందులో బాబు అంటే… గడ్డం బాబుగా సినీ పరిశ్రమ చెప్పుకునే రాధాకృష్ణ ఆమెను గుప్పిట్లో పెట్టుకున్నాడని అంటూ ఉంటారు. కానీ ఈ లెటర్ లో మాత్రం బాబు (రాధాకృష్ణ) మంచివాడని, ఇంకెవరో మోసం చేశారని ఉంది.
(సీనియర్ జర్నలిస్ట్ భవనారాయణ గారి నుంచి ఇందులోని కొంత సమాచారం సేకరించబడింది)
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.