Dj Tillu Movie: డీజే టిల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.. ప్రేక్షకుల ముందుకు వచ్చేది అప్పుడే..
యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda).. డైరెక్టర్ విమల్ కృష్ణ కాంబోలో వచ్చిన లేటేస్ట్ చిత్రం డీజే టిల్లు (Dj Tillu) . ఇందులో సిద్ధుకు జోడీగా యంగ్ హీరోయిన్ నేహా శెట్టి (Neha Shetty) నటించింది.
యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda).. డైరెక్టర్ విమల్ కృష్ణ కాంబోలో వచ్చిన లేటేస్ట్ చిత్రం డీజే టిల్లు (Dj Tillu) . ఇందులో సిద్ధుకు జోడీగా యంగ్ హీరోయిన్ నేహా శెట్టి (Neha Shetty) నటించింది. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, సాంగ్స్, ట్రైలర్ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 12న థియేటర్లలో విడుదల కానుంది. ఈక్రమంలో సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేసింది చిత్రయూనిట్. తాజాగా ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్ చేశారు మేకర్స్.
యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ.. నేహా శెట్టి జంటగా నటించిన సినిమా డీజే టిల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫిబ్రవరి 10న ఫిల్మ్ నగర్లోని రామానాయుడు స్టూడియోలో సాయంత్రం 6 గంటలకు నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ.. అందుకు సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. యూత్ మాత్రమే కాకుండా.. ఫ్యామిలీ ఆడియన్స్ అంతా మెచ్చే సినిమా అవుతుందని డైరెక్టర్ విమల్ కృష్ణ తెలిపాడు. డిజె టిల్లు ట్రైలర్ చూసి రొమాంటిక్ ఫిల్మ్ అనుకుంటారు కానీ ఈ సినిమా అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ కలిపిన ఒక ప్యాకేజ్ లాంటిది. ఇందులో కామెడీ, థ్రిల్, ఎంటర్ టైన్ మెంట్, రొమాన్స్ అన్నీ ఉన్నాయని చెప్పుకొచ్చింది నేహ. అలాగే.. ప్రేమ కథకు చిన్న క్రైమ్ కోణాన్ని జతచేసి రాసిన కథ ఇది. ప్రేమ కథే ఎక్కువగా ఉంటుంది. నేను చిన్నప్పటి నుంచి చూసిన మనుషుల్లో ఒక ప్రత్యేకమైన ప్రవర్తన గమనించాను. వాళ్ల క్యారెక్టర్ లను తెరపై చూపించాలని అనుకని ఈ సినిమాలో పాత్రలను రూపకల్పన చేసినట్లు హీరో సిద్దూ జొన్నలగడ్డ తెలిపారు.
Isha Chawla: ప్రేమకావాలి అంటూ ఒకసారి ఎంట్రీ.. డబల్ ధమాకాతో రీఎంట్రీ..’ఇషాచావ్లా’ న్యూ ఫొటోస్..
Meenakshi Chaudhary: అలాంటి సీన్స్ చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదంటున్న బ్యూటీ..