Shruti Haasan: శృతి హాసన్ సంచలన నిర్ణయం !!.. హీరోయిన్గా కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలో..
తండ్రి పేరును ఎక్కడా వాడుకోకుండా.. సింగర్‌గా కెరీర్ ఆరంభించి.. ఆ తర్వాత మ్యూజిక్ కంపోజర్‌గా మాంచి గుర్తింపు తెచ్చుకుంది శృతిహాసన్. ఆ తర్వాత కథనాయికగా

తండ్రి పేరును ఎక్కడా వాడుకోకుండా.. సింగర్‌గా కెరీర్ ఆరంభించి.. ఆ తర్వాత మ్యూజిక్ కంపోజర్‌గా మాంచి గుర్తింపు తెచ్చుకుంది శృతిహాసన్. ఆ తర్వాత కథనాయికగా వెండితెరకు పరిచయమయ్యి.. ప్రేక్షకులకు దగ్గరైంది శృతి. తాజాగా ఈ అమ్మడు రైటర్‌గా మారి ఓ స్టోరీ రెడీ చేసిందట. అన్ని కుదిరితే.. ఆసినిమాకు దర్శకత్వం చేయాలని భావిస్తుందట కమల్ తనయ.
ఒకప్పుడు అగ్రహీరోల సరసన ఎన్నో హీట్ సినిమాల్లో నటించి.. టాప్ హీరోయిన్గా కొనసాగింది శృతి హాసన్. ఆ తర్వాత కొన్ని రోజులు సినిమాలకు దూరంగా ఉండిపోయింది. ఇటీవల మాస్ మాహారాజా రవితేజ సరసన క్రాక్ సినిమాలో నటించి.. బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది ఈ బ్యూటీ. ఇక ఈ మూవీ తర్వాత కెరీర్ ఇప్పుడు మళ్లీ పుంజుకుంది. వరుసగా సినిమాలను చేస్తూ.. ఫుల్ బిజీగా మారిపోయింది. ప్రస్తుతం శృతి.. పవన్ కళ్యాణ్ సరసన వకీల్ సాబ్ చేస్తోంది. ఈ మూవీ షూటింగ్ పూర్తిచేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ జోడీగా సలార్ సినిమాలో నటిస్తోంది. ఈ మూవీని కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్నాడు.. అటు సినిమాలు చేస్తూ.. వెబ్ సిరీస్‌లోనూ చేస్తుంది. ఇటీవల నెట్ ఫ్లిక్స్‌లో విడుదలైన పిట్ట కథలు సినిమాలో శ్రుతి అలరించిన విషయం తెలిసిందే. ఈ సినిమాల తర్వాత శ్రుతి తాను స్వయంగా రాసుకున్న స్టోరీని డైరెక్ట్ చేయాలని భావిస్తున్నట్లుగా సమాచారం. హీరోయిన్గా కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలో శృతి ఈ నిర్ణయం తీసుకోవడం సరైనేదానా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరీ చూడాలి… శృతిహాసన్ మెగా ఫోన్ పట్టుకోని సక్సెస్ సాధిస్తుందా ? లేదా ? అనేది.
Also Read:
Sobhan Babu Death Anniversary: సినీ పరిశ్రమలో ఎంట్రీ మొదలు రిటైర్మెంట్ వరకు ప్రతిదీ సంచలనమే..




