AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vakeel Saab Movie: దుండిగల్ MLRIT కాలేజీలో ‘వకీల్ సాబ్’ మ్యూజిక్ ఫెస్ట్.. మధ్యాహ్నం 2 గంటలకు..

పవర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్రధాన పాత్రలో దర్శకుడు వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘వకీల్ సాబ్’. ఇది హిందీ హిట్ మూవీ ‘పింక్’కు తెలుగు రీమేక్. ఈ సినిమాలో

Vakeel Saab Movie: దుండిగల్ MLRIT కాలేజీలో 'వకీల్ సాబ్' మ్యూజిక్ ఫెస్ట్.. మధ్యాహ్నం 2 గంటలకు..
Vakeel Saab
Rajitha Chanti
|

Updated on: Mar 20, 2021 | 1:01 PM

Share

పవర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్రధాన పాత్రలో దర్శకుడు వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘వకీల్ సాబ్’. ఇది హిందీ హిట్ మూవీ ‘పింక్’కు తెలుగు రీమేక్. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. అంజలి, నివేదా థామస్, అనన్య కీలక పాత్రల్లో కనిపిస్తారు. ఎస్.ఎస్.థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పొస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన మగువా మగువా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. పవన్ రీఎంట్రీతో వస్తున్న ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. సినిమా తప్పకుండా బాక్సాఫీస్ వద్ద సాలీడ్ వసూళ్లను అందుకోగలదని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే.. ఈ మూవీ మ్యూజిక్ ఫెస్ట్ ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు దుండిగల్‏లోని MLRIT కాలేజీలో జరగనుంది. ప్రస్తుతం పవన్ రానాతో కలిసి ‘అయ్యప్పునుమ్ కోషియుమ్’ రీమేక్ చేస్తున్నాడు. అలాగే క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు అనే సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ పోస్టర్స్‏కు మంచి రెస్పాన్స్ వచ్చింది. పవన్ కళ్యాణ్ కెరీర్‌లో 27వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎ.ఎం.రత్నం నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో పవన్ సరసన ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్, బాలీవుడ్ బ్యూటీ జాక్వలైన్‌ ఫెర్నాండెజ్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారని తెలిసింది. ఈ సినిమా మొగలాయిలా కాలంనాటి కథతో తెరకెక్కుతుందని తెలుస్తుంది. పవన్ కెరీర్ లోనే హయ్యెస్ట్ బడ్జెట్ మూవీగా నిలవబోతున్న ఈ మూవీని.. దాదాపు 170 కోట్ల రూపాయల వ్యయంతో తెరకెక్కించబోతున్నారట. అంతే కాదు.. ఈ సినిమా  ప్రీ రిలీజ్ ఈవెంట్‏తో సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.. ఈ సినిమాను ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. గతేడాది వేసవిలో విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్‏కు ముఖ్య అతిధులుగా అగ్ర హీరోలు వస్తున్నట్లుగా ఓ వార్త ఫీల్మ్ నగర్లో చక్కర్లు కొడుతుంది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవితోపాటు.. ఆయన తనయుడు రామ్ చరణ్ కూడా వస్తున్నట్లు సమాచారం. అయితే ఈ మూవీ ఈవెంట్‏లో మెగా హీరోలు ముగ్గురు ఒకే ఫ్రేంలో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక అదే గనక జరిగితే ఫ్యాన్స్‏కు పండగే.

Also Read:

Telangana MLC Election Results 2021 LIVE: తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు.. 67వ అభ్యర్థి రాములు నాయక్ ఎలిమినేట్

Follow Us
'గబ్బర్ సింగ్' నటుడికి బ్రెయిన్ స్ట్రోక్.. ఆస్పత్రిలో చికిత్స
'గబ్బర్ సింగ్' నటుడికి బ్రెయిన్ స్ట్రోక్.. ఆస్పత్రిలో చికిత్స
తాజా ICC ర్యాకింగ్స్‌తో బయటపడ్డ టీమిండియా డొల్లతనం!
తాజా ICC ర్యాకింగ్స్‌తో బయటపడ్డ టీమిండియా డొల్లతనం!
మేక vs గొర్రె మాంసం.. జోరు వానల్లో ఏది బెస్ట్..?
మేక vs గొర్రె మాంసం.. జోరు వానల్లో ఏది బెస్ట్..?
-మద్యం ప్రియులకు మస్త్‌ గుడ్‌న్యూస్..అందుబాటులోకి గోల్డ్‌ వోడ్కా!
-మద్యం ప్రియులకు మస్త్‌ గుడ్‌న్యూస్..అందుబాటులోకి గోల్డ్‌ వోడ్కా!
రైతులను రిచ్ చేసే పంట.. పూర్తి వివరాలు మీ కోసం..
రైతులను రిచ్ చేసే పంట.. పూర్తి వివరాలు మీ కోసం..
ఆలయంలో ఎదురుపడ్డ నాగుపాము,పిల్లి.. ఆ తర్వాత జరిగిందిదే..
ఆలయంలో ఎదురుపడ్డ నాగుపాము,పిల్లి.. ఆ తర్వాత జరిగిందిదే..
గర్భవతినని బాస్‌కి మెసేజ్ చేసిన మహిళ.. 3 గంటల్లోనే ఉద్యోగం ఊస్ట్‌
గర్భవతినని బాస్‌కి మెసేజ్ చేసిన మహిళ.. 3 గంటల్లోనే ఉద్యోగం ఊస్ట్‌
తెలంగాణ విద్యార్థులకు అలెర్ట్.. జూలై 24న విద్యాసంస్థల బంద్‌..!
తెలంగాణ విద్యార్థులకు అలెర్ట్.. జూలై 24న విద్యాసంస్థల బంద్‌..!
మీపేరు మీద వేరేవాళ్ళు SIM వాడుతున్నారా? గుర్తించడం ఎలా?
మీపేరు మీద వేరేవాళ్ళు SIM వాడుతున్నారా? గుర్తించడం ఎలా?
మేక పిల్లల కోసం దారుణం.. మాజీ సర్పంచ్ దాడిలో పశువుల కాపరి బలి!
మేక పిల్లల కోసం దారుణం.. మాజీ సర్పంచ్ దాడిలో పశువుల కాపరి బలి!