సినిమా విడుదలను వాయిదా వేస్తున్నాం… అధికారికంగా ప్రకటించిన రామ్ గోపాల్ వర్మ.. కారణమేంటంటే..
Ram Gopal Varma: గత కొద్ది రోజులుగా కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తుంది. దీంతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు సంఖ్య గణనీయంగా పెరుగిపోయింది.
Ram Gopal Varma: గత కొద్ది రోజులుగా కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తుంది. దీంతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు సంఖ్య గణనీయంగా పెరుగిపోయింది. దీంతో కొన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ ప్రకటించాయి. ఈసారి వైరస్ తన ప్రభావాన్ని మరింత భయంకరంగా చూపిస్తుందని వైద్యులు సూచిస్తున్నారు. ప్రజలంతా కరోనా నిబంధనలను పాటించాలని ఇప్పటికే ప్రభుత్వాలు ప్రకటిస్తున్నాయి. లేకపోతే పరిస్థితి చేయిదాటే ప్రమాదం ఉందంటూ హెచ్చరిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలు రాత్రి సమయంలో కర్ఫ్యూ పాటిస్తున్నాయి. ఇదిలా ఉంటే… ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఇండస్ట్రీలకు, ప్రజలకు కోవిడ్ సెకండ్ వేవ్ మరింత ఆందోళనకు గురిచేస్తోంది. కరోనాను మరోసారి భరించే శక్తి జనాల్లో లేదు. ఈ మహమ్మారి ప్రభావంతో ఇప్పటికే దేశవ్యాప్తంగా పేదరికం మరింత పెరిగింది. ఇదిలా ఉంటే అన్ని పరిశ్రమలతోపాటు ఈ కోవిడ్ ప్రభావం సినీ ఇండస్ట్రీకి కూడా కోలుకోలేని దెబ్బకోట్టింది. కరోనాతో థియేటర్లు, మూవీ షూటింగ్స్ అన్ని మూతపడిపోగా.. సినీ కార్మికులు ఆర్థికంగా కుంగిపోయారు. ఇప్పుడు మళ్లీ విజృంభిస్తున్న కరోనా ప్రభావం మరోసారి సినీ ఇండస్ట్రీపై ప్రభావం చూపేలా ఉంది.
ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కరోనా ప్రభావంతో తమ సినిమా విడుదల వాయిదా వేసుకున్నట్లుగా ప్రకటించాడు. ప్రస్తుతం ఆయన ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన సినిమా డీ-కంపెనీ. ఈ సినిమాను మార్చి 26న విడుదల చేయనున్నట్లు ప్రకటించాడు. అలాగే సినిమాకు సంబంధించిన టీజర్ ట్రైలర్స్ విడుదల చేసి సినిమా పై అంచనాలు క్రియేట్ చేసాడు. దీంతో ఈ మూవీ కోసం అభిమానులు ఎంతోగానో ఎదురుచూస్తున్నారు. కానీ దేశంలో కరోనా పరిస్థితిని గమనించి ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా రామ్ గోపాల్ వర్మ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు. ఈ మేరకు.. “దేశంలోని అనేక ప్రాంతాల్లో కరోనా కేసుల సంఖ్య ఆకస్మాత్తుగా పెరిగిపోయింది. కొత్త లాక్డౌన్ పై వస్తున్న వార్తల మధ్య మేము డీ కంపెనీ సినిమా విడుదలను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నాం. త్వరలోనే కొత్త తేదీని ప్రకటిస్తాము” అంటూ ట్వీట్ చేశాడు.
Due to the sudden severe covid rise in many parts of the country and also amid continuous news of new lockdowns, we at SPARK decided to postpone the release of D COMPANY ..A new date will be announced ASAP #DCompany @SparkSagar1
— Ram Gopal Varma (@RGVzoomin) March 19, 2021
Also Read:
Sobhan Babu Death Anniversary: సినీ పరిశ్రమలో ఎంట్రీ మొదలు రిటైర్మెంట్ వరకు ప్రతిదీ సంచలనమే..