Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాలయ్యబాబుతో భారీ హిట్ కొట్టింది.. ఎన్టీఆర్‌తో ఫ్లాప్ అందుకుంది.. ఈ హీరోయిన్ ఎవరో తెలుసా.?

అప్పట్లో శ్రీదేవి అక్కినేని నాగేశ్వరరావుతో చేశారు. అలాగే నాగార్జునతో కూడా చేశారు. అలాగే ఇప్పటి జనరేషన్ హీరోయిన్స్ లో రకుల్ ప్రీత్ సింగ్ కూడా నాగ చైతన్యతో సినిమా చేసింది.. అదేవిధంగా నాగార్జునతో కూడా సినిమా చేసింది. అందాల చందమామ కాజల్ అగర్వాల్ కూడా చిరంజీవితో అలాగే రామ్ చరణ్ తో హీరోయిన్ గా నటించింది.

బాలయ్యబాబుతో భారీ హిట్ కొట్టింది.. ఎన్టీఆర్‌తో ఫ్లాప్ అందుకుంది.. ఈ హీరోయిన్ ఎవరో తెలుసా.?
Ntr, Balakrishna
Follow us
Rajeev Rayala

|

Updated on: Jul 29, 2024 | 11:36 AM

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ ఒకే ఫ్యామిలోని హీరోలతో పని చేయడం చాలా కామన్. తండ్రి, కొడుకులతో హీరోయిన్ గా చేసిన వారు చాలా మంది ఉన్నారు. అప్పట్లో శ్రీదేవి అక్కినేని నాగేశ్వరరావుతో చేశారు. అలాగే నాగార్జునతో కూడా చేశారు. అలాగే ఇప్పటి జనరేషన్ హీరోయిన్స్ లో రకుల్ ప్రీత్ సింగ్ కూడా నాగ చైతన్యతో సినిమా చేసింది.. అదేవిధంగా నాగార్జునతో కూడా సినిమా చేసింది. అందాల చందమామ కాజల్ అగర్వాల్ కూడా చిరంజీవితో అలాగే రామ్ చరణ్ తో హీరోయిన్ గా నటించింది. వీరిలానే ఓ హీరోయిన్ బాలయ్య బాబుతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమాలు చేసింది. కానీ బాలయ్యబాబుతో భారీ హిట్ అందుకున్న ఆ హీరోయిన్.. తారక్ తో మాత్రం డిజాస్టర్ అందుకుంది. ఇంతకూ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా.?

ఇది కూడా చదవండి :  స్టార్ హీరోయిన్స్ కూడా పనికిరారు.. అలనాటి అందాల తార గౌతమి కూతుర్ని చూశారా.?

నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. బాలయ్య నటిస్తున్న సినిమాలు బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాలను సొంతం చేసుకుంటున్నాయి. అఖండ సినిమా తర్వాత వీరసింహారెడ్డి సినిమా చేసి సంచలన విజయాన్ని అందుకున్నారు. అలాగే రీసెంట్ గా భగవంత్ కేసరి సినిమాతో కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇక ఇప్పుడు బాబీ దర్శకత్వంలో మరో యాక్షన్ ఎంటర్టైనర్ తో రానున్నారు. అయితే బాలయ్యతో , ఎన్టీఆర్ తో కలిసి నటించిన హీరోయిన్స్ లో శ్రుతిహాసన్ ఒకరు.

ఇది కూడా చదవండి :Raviteja : ఒరేయ్ ఆజామో.. మన మాస్ రాజా కూతురు మెంటలెక్కించిందిగా..!!

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి సినిమా ఘనవిజయం సాధించింది. ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రుతిహాసన్ కనిపించింది. అలాగే మరో హీరోయిన్ గా హనీరోజ్ నటించింది. ఈ సినిమా గతఏడాది సంక్రాంతికి రిలీజ్ అయ్యింది. అలాగే ఇదే ఎన్టీఆర్ హీరోగా నటించిన ఆ రామయ్య వస్తావయ్యా సినిమాలో శ్రుతిహాసన్ హీరోయిన్ గా చేసింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సమంత మరో హీరోయిన్ గా చేసింది. కానీ ఈ సినిమా బకాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. కానీ ఈ సినిమాలో సాంగ్స్ మంచి హిట్ గా నిలిచాయి. ఇలా బాబాయ్‌కి హిట్ ఇచ్చి అబ్బాయికి ఫ్లాప్ ఇచ్చింది శ్రుతిహాసన్. ఇప్పుడు శ్రుతిహాసన్ కూడా పాన్ ఇండియా స్టార్‌గా మారింది. రీసెంట్‌గా ప్రభాస్ సలార్ సినిమా చేసింది. ఎన్టీఆర్ కూడా పాన్ ఇండియా సినిమాలు చేస్తుండటంతో ఈ అమ్మడు మరోసారి తారక్ తో కలిసి నటించే అవకాశం లేకపోలేదు. చూడాలి మరి ఏం జరుగుతుందో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

టీమిండియా ఛీ కొట్టింది.. కట్‌చేస్తే సెంచరీతో సెలెక్టర్లకు కౌంటర్
టీమిండియా ఛీ కొట్టింది.. కట్‌చేస్తే సెంచరీతో సెలెక్టర్లకు కౌంటర్
మరో ఘోర విషాదం.. కేదార్‌నాథ్‌లో కుప్పకూలిన హెలికాఫ్టర్!
మరో ఘోర విషాదం.. కేదార్‌నాథ్‌లో కుప్పకూలిన హెలికాఫ్టర్!
పోలీసులా వచ్చి కాల్పులు జరిపిన దుండగుడు.. అమెరికాలో దారుణం..
పోలీసులా వచ్చి కాల్పులు జరిపిన దుండగుడు.. అమెరికాలో దారుణం..
రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు.. ఉరుములు, మెరుపులతో జోరు వానలు!
రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు.. ఉరుములు, మెరుపులతో జోరు వానలు!
అడవి శేష్‌కు వన్ ప్లస్ వన్ ఆఫర్ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ..
అడవి శేష్‌కు వన్ ప్లస్ వన్ ఆఫర్ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ..
భారత్ vs న్యూజిలాండ్ షెడ్యూల్ ఇదే.. అందరి చూపు ఆ ఇద్దరివైపే..!
భారత్ vs న్యూజిలాండ్ షెడ్యూల్ ఇదే.. అందరి చూపు ఆ ఇద్దరివైపే..!
ఎల్‌బీనగర్‌లో దారుణం.. స్పాట్‌లోనే ఇద్దరు సజీవదహనం
ఎల్‌బీనగర్‌లో దారుణం.. స్పాట్‌లోనే ఇద్దరు సజీవదహనం
మరికొన్ని గంటల్లోనే ఇంటర్‌ సప్లిమెంటరీ 2025 ఫలితాలు.. లింక్ ఇదే!
మరికొన్ని గంటల్లోనే ఇంటర్‌ సప్లిమెంటరీ 2025 ఫలితాలు.. లింక్ ఇదే!
రిటైర్మెంట్ ఏజ్‌లో భారీ సిక్స్.. కొడితే స్టేడియం దాటిపోయిందిగా..
రిటైర్మెంట్ ఏజ్‌లో భారీ సిక్స్.. కొడితే స్టేడియం దాటిపోయిందిగా..
అతిరథ మహారథుల మధ్య గద్దర్ అవార్డుల ప్రదానోత్సవ వేడుక
అతిరథ మహారథుల మధ్య గద్దర్ అవార్డుల ప్రదానోత్సవ వేడుక