Shruti Haasan : సోషల్ మీడియా వేదికగా బాయ్ ఫ్రెండ్ తో కలిసి చిందులేసిన శ్రుతిహాసన్..
అందాల భామ శృతిహాసన్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి చాలా కాలమే అయ్యింది. అనగనగా ఓ ధీరుడు సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది శృతి.
అందాల భామ శ్రుతిహాసన్(Shruti Haasan )హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి చాలా కాలమే అయ్యింది. అనగనగా ఓ ధీరుడు సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈ ముద్దుగుమ్మ. అంతకు ముందు ఒకటి రెండు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించింది. ఇక హీరోయిన్ గా మారిన తర్వాత శ్రుతిహాసన్ వరుస సినిమాలతో దూసుకుపోతోంది. శ్రుతి చేసిన సినిమాలన్నీ వరుస ఫ్లాప్ లు అవుతున్న నేపథ్యంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. గబ్బర్ సింగ్ సినిమాతో శ్రుతిహాసన్ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆతర్వాత వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ లు దక్కించుకుంది. గబ్బర్ సింగ్ తర్వాత శ్రుతిహాసన్ నటించిన సినిమాలన్నీ మంచి విజయాలను అందుకున్నాయి. అదే సమయంలో ఈ అమ్మడు తమిళ్ లోనూ సినిమాలు చేసి సత్తా చాటుకుంది. అలాగే బాలీవుడ్ లోనూ అడుగు పెట్టింది.
ఇక ఈ అమ్మడు గతంలో ఓ వ్యక్తిని ప్రేమించి చివరకు అతడికి బ్రేకప్ చెప్పింది. ఆసమయంలో సినిమాలు కూడా తగ్గించింది. కొద్ది రోజులు డిప్రషన్ లోకి కూడా వెళ్ళింది. ఆ తర్వాత ఎంతో దైర్యంగా డిప్రషన్ నుంచి బయటకు వచ్చి సినిమాలు చేస్తూ పూర్తిగా మాములు స్థితికి వచ్చేసింది. ఇటీవల ఈ అమ్మడు నటించిన క్రాక్ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాలో చిన్న పాత్రలో కనిపించి ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు శ్రుతి తన కొత్త బాయ్ ఫ్రెండ్ తో జాలిగా గడుపుతోంది. అతడితో ఫోటోలు దిగుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది. తాజాగా శ్రుతి ఓ వీడియోను షేర్ చేసింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి డాన్స్ చేస్తోన్న వీడియోను పోస్ట్ చేసింది ఈ చిన్నది. ఈ వీడియోలో శ్రుతి పాటకు తగ్గట్టు మూమెంట్స్ చేస్తుంటే ఆమె బాయ్ ఫ్రెండ్ మాత్రం డాన్స్ చేయడానికి చాలా ఇబ్బందిపడ్డట్టు కనిపిస్తోంది. మొత్తంగా ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
View this post on Instagram