AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Arjun: పుష్ప సిగ్నేచర్ స్టెప్ అసలు రహస్యం అదే.. బయటపెట్టిన అల్లు అర్జున్..

ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా సౌత్ టూ నార్త్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఎర్రచందనం కూలీ నుంచి సిండికేట్ హెడ్‏గా పుష్పరాజ్ ఎదగడం..

Allu Arjun: పుష్ప సిగ్నేచర్ స్టెప్ అసలు రహస్యం అదే.. బయటపెట్టిన అల్లు అర్జున్..
Allu Arjun
Rajitha Chanti
|

Updated on: Jul 17, 2022 | 1:42 PM

Share

ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులను బద్దలుగొట్టింది పుష్ప (Pushpa). ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో సంచలన విజయం సాధించింది. గతేడాది విడుదలైన ఈ సినిమా థియేటర్ల వద్ద రికార్డ్ స్థాయిలో వసూళ్లు రాబట్టగా.. డిజిటల్ ప్లాట్ ఫాంలోనూ సత్తా చాటింది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా సౌత్ టూ నార్త్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఎర్రచందనం కూలీ నుంచి సిండికేట్ హెడ్‏గా పుష్పరాజ్ ఎదగడం.. అతని మ్యానరిజం, ఆటిట్యూడ్‏కు సామాన్యులే కాకుండా సినీ ప్రముఖులు సైతం ఫిదా అయ్యారు. ఇక ఇందులోని సాంగ్స్ సైతం యూట్యూబ్ ను షేక్ చేశాయి. ఇక ఇటీవలే ఈ సినిమా ఇండియాలోనే అత్యంత పాపులర్ మ్యాగజైన్ ఇండియా టూడే కొత్త ఎడిషన్ పై అల్లు అర్జున్ తగ్గేదేలే అన్న ఫోజ్ తో ఉన్న ఫోటో కూడా వచ్చిన సంగతి తెలిసిందే. ది సౌత్ స్వాగ్ అంటూ సౌత్ సినిమాలపై స్పెషల్ ఆర్టికల్ కూడా రాశారు. ఇక పుష్ప మ్యానరిజం వెనక ఉన్న అసలు విషయాన్ని అల్లు అర్జున్ బయటపెట్టాడు.

ఇండియా టూడే పత్రికతో నిర్వహించిన ఇంటర్వ్యూలో బన్నీ.. పుష్ప సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. దేశవ్యాప్తంగా ఈ మూవీకి వస్తున్న ఆదరణ గురించి బన్నీ స్పందిస్తూ.. ” దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను మెప్పించాలనే ఆలోచన లేదు. కానీ ఇప్పుడు వస్తున్న రెస్పాన్స్ మాత్రం ఊహించలేదు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలను ఆకట్టుకోవాలనుకున్నాం. కానీ ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో ఇంతగా రెస్పాన్స్ వస్తుందనుకోలేదు. ” అంటూ చెప్పుకొచ్చారు.

అలాగే ఈ సినిమాలోని బన్నీ నడక.. ఆటిట్యూడ్‏ను సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ఫాలో అయిన సంగతి తెలిసిందే. ఇక అంతగా పాపులర్ అయిన పుష్ప రాజ్ సిగ్నెచర్ స్టెప్ గురించి బన్నీ స్పందిస్తూ.. ” డైరెక్టర్ సుకుమార్ ఏమి ఆలోచిస్తున్నారు.. ఏం చేస్తున్నారు అనే విషయం నాకు తెలియదు. కానీ అతను చెప్పారు నేను సినిమాలో అలాగే నడవాలి అని. అతను చెప్పినట్లే నా భుజాన్ని ఎత్తుగా పెంచి.. బాడీ లాంగ్వేజ్ మార్చి నడిచాను. అలా నడవడం సులభమే అని చెప్పారు ” అన్నారు. ఇక పుష్ప సెకండ్ పార్ట్ పుష్ప ది రూల్ ఆగస్ట్ చివరి వారంలో పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది. ఇందులో రష్మిక మందన్నా కథానాయికగా నటించగా ఫహద్ ఫాజిల్ ప్రతినాయకుడి పాత్రలో కనిపించారు.

వాకింగ్ ఇలాచేస్తే పొట్ట తొందరగా తగ్గుతుంది! ఈజీగా స్లిమ్‌ అవుతారు
వాకింగ్ ఇలాచేస్తే పొట్ట తొందరగా తగ్గుతుంది! ఈజీగా స్లిమ్‌ అవుతారు
మీ ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయా? ఇవే ప్రధాన కారణం కావచ్చు!
మీ ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయా? ఇవే ప్రధాన కారణం కావచ్చు!
నల్ల ద్రాక్షతో బంపర్‌ బెనిఫిట్స్.. రోజూ తినడం వల్ల కలిగే అద్భుతం
నల్ల ద్రాక్షతో బంపర్‌ బెనిఫిట్స్.. రోజూ తినడం వల్ల కలిగే అద్భుతం
పెళ్లైన 3 రోజుల తరువాత.. గుడ్ న్యూస్ చెప్పి షాకిచ్చింది వీడియో
పెళ్లైన 3 రోజుల తరువాత.. గుడ్ న్యూస్ చెప్పి షాకిచ్చింది వీడియో
ఎక్కడ మొదలైందో.. అక్కడే ఆగిన త్రివిక్రమ్ వీడియో
ఎక్కడ మొదలైందో.. అక్కడే ఆగిన త్రివిక్రమ్ వీడియో
మూసుకుపోయిన.. కళ్యాణ్ కళ్లను తెరిపించిన శివాజీ వీడియో
మూసుకుపోయిన.. కళ్యాణ్ కళ్లను తెరిపించిన శివాజీ వీడియో
మీకు కొంచెం కూడా కోపం రావడం లేదా? జాన్వీ కపూర్ ఎమోషనల్ పోస్ట్
మీకు కొంచెం కూడా కోపం రావడం లేదా? జాన్వీ కపూర్ ఎమోషనల్ పోస్ట్
జుట్టు రాలుతోంద‌ని తెగ‌ ఫీల‌వుతున్నారా? ఈ నూనెతో మసాజ్‌ చేసుకుంటే
జుట్టు రాలుతోంద‌ని తెగ‌ ఫీల‌వుతున్నారా? ఈ నూనెతో మసాజ్‌ చేసుకుంటే
నాగ వంశీ నుంచి దిల్ రాజు చేతికి..? వీడియో
నాగ వంశీ నుంచి దిల్ రాజు చేతికి..? వీడియో
రికార్డులు తిరగరాసిన రైతు బిడ్డ.. ఇప్పుడేం చేస్తున్నాడు?
రికార్డులు తిరగరాసిన రైతు బిడ్డ.. ఇప్పుడేం చేస్తున్నాడు?