AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Folk Singer : 500 పైగా పాటలు పాడాను.. కానీ.. ఒక్క పాటతో క్రేజ్ వచ్చింది.. ఫోక్ సింగర్..

ఇటీవల సోషల్ మీడియాలో ఫోక్ సాంగ్స్ ఏ స్థాయిలో దూసుకుపోతున్నాయో చెప్పక్కర్లేదు. రోజుకో సాంగ్ యూట్యూబ్ లో సంచనలం సృష్టిస్తుంది. ఇప్పుడు తెలంగాణ పల్లె పాటలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తుంది. మరోవైపు నెట్టింట ఈ పాటలు దుమ్మురేపుతున్నాయి. మరీ ఈ ఫోక్ సాంగ్స్ పాడిన సింగర్స్ గురించి మీకు తెలుసా.. ?

Folk Singer : 500 పైగా పాటలు పాడాను.. కానీ.. ఒక్క పాటతో క్రేజ్ వచ్చింది.. ఫోక్ సింగర్..
Ushakka
Rajitha Chanti
|

Updated on: Mar 08, 2026 | 10:27 PM

Share

ప్రస్తుతం సోషల్ మీడియాలో తెలంగాణ ఫోక్ సాంగ్స్ దుమ్మురేపుతున్నాయి. రోజుకో పాట సోషల్ మీడియాలో సంచలనం క్రియేట్ చేస్తున్నాయి. అయితే ఫోక్ సాంగ్స్ పక్కన పెడితే ఆ పల్లె పాటలకు తమ గాత్రంతో అద్భుతమైన రూపం ఇస్తున్నారు కొందరు సింగర్స్. గ్రామాల్లో పొలం పనులు చేసుకునే మహిళలు సాధారణంగా పాడుకునే పాటలే ఇప్పుడు సోషల్ మీడియా ప్రపంచాన్ని ఏలేస్తున్నాయి. ఇటీవల విడుదలైన ఓ సాంగ్ ఇప్పుడు నెట్టింట సునామీ సృష్టిస్తుంది. అదేనండి.. రాతిరి రాతిరిలో సాంగ్. ఈ పాట ఇప్పుడు నెట్టింట ఏ స్థాయిలో దూసుకుపోతుందో చెప్పక్కర్లేదు. ఇప్పటివరకు ఈ పాటకు 21 మిలియన్ వ్యూస్ వచ్చాయి. మరోవైపు చిన్నా, పెద్దా తేడా లేకుండా ఈ పాటకు తమదైన స్టైల్లో స్టెప్పులేస్తున్నారు.

ఎక్కువమంది చదివినవి : Folk Singer : 4 లక్షలతో తీస్తే యూట్యూబ్‏నే షేక్ చేసిన ఫోక్ సాంగ్.. రివెన్యూ ఎంత వచ్చిందంటే..

“రాతిరి రాతిరి రాతిరిలో జాము జాము రాతిరిలో.. గొంగడేసి ఈడ పడ్ననే ఎప్పుడు ఈడ కొత్తవే..” అంటూ సాగే ఈ పాట ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది. ఈ పాటను సింగర్ నర్సింలు, ఉషక్క కలిసి పాడారు. అలాగే కృష్ణుడు మ్యూజిక్ అందించగా.. మాధురి రాథోడ్, ఈశ్వర్ సాయి నటించారు. ఈ క్రమంలోనే సింగర్ నర్సింలు, ఉషక్క ఓ ఇంటర్వ్యూలో తమ ప్రయాణం గురించి ఆసక్తికర విషయాలు బయటపెట్టారు.

ఎక్కువమంది చదివినవి : Ravi Teja : రవితేజ తింటుంటే ఆ ప్రొడ్యుసర్ దారుణంగా అవమానించాడు.. ఎలా దెబ్బకొట్టాడంటే..

ఇటీవల యూట్యూబ్‌లో అద్భుతమైన విజయాన్ని సాధించిన “రాత్రి రాత్రి రాత్రిలో జాము జాము రాత్రిలో” అనే పాట గురించి మాట్లాడుతూ.. కోటి 30 లక్షలకు పైగా వ్యూస్ అందుకుంటూ సంచలనం సృష్టించిందని అన్నారు. సినిమా పాటలకు కూడా దక్కని ఆదరణ జానపద గీతాలకు లభిస్తోందని అన్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఈ జానపద గీతాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరినీ ఆకట్టుకుంటున్నాయని అన్నారు.

ఎక్కువమంది చదివినవి : Tollywood : ఆశాపాశం సాంగ్ రాసింది నేనే.. కానీ అతడు సాంగ్ నా కెరీర్ మలుపు తిప్పింది.. లిరిసిస్ట్..

తాము ఇప్పటివరకు దాదాపు 500 పైగా పాటలు పాడమని అన్నారు. కానీ ఈ సాంగ్ మాత్రం విపరతీమైన క్రేజ్ సంపాదించుకుందని అన్నారు. గతంలో “కెమెరా పట్టినోడే సీమ దసరా చిన్నోడు” పాటతోనూ ఫేమస్ అయినట్లు గుర్తుచేసుకున్నారు. ఇప్పటికీ ఎన్నో పాటలతో అలరించనున్నట్లు తెలిపారు.

ఎక్కువమంది చదివినవి : Song Flashback: రాలిపోయే పువ్వా పాటకు నేషనల్ అవార్డ్.. కానీ వెనక్కు ఇచ్చేసిన వేటూరి.. కారణం ఇదే..

 

Follow Us