Viral Photo: ఈ ఫోటోలోని ఈ చిన్నారి.. ఇప్పుడు ఓ క్రేజీ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా..?

తమ అభిమాన స్టార్స్ చిన్ననాటి ఫోటోలపై ఫ్యాన్స్ భలే ఇంట్రస్ట్ చూపిస్తుంటారు. ఇంతకుముందు అంటే పేపర్ లో ఫోటోలు వస్తే కట్ చేసి దాచిపెట్టుకునేవారు. కానీ ఇప్పుడు ఇంటర్నెట్ ట్రెండ్ పెరగడంతో.. అన్నీ ఆన్ లైన్ లోనే లభిస్తున్నాయి.

Viral Photo: ఈ ఫోటోలోని ఈ చిన్నారి.. ఇప్పుడు ఓ క్రేజీ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా..?
Heroine Childhood Pic
Follow us
Ram Naramaneni

|

Updated on: Jan 28, 2022 | 9:42 AM

Tollywood Heroine: ఇప్పుడు అంటే నెట్ వినియోగం బాగా పెరిగిపోయింది. దీనితో ఫిల్మ్ సెలబ్రిటీలకు, అభిమానులకు(Fans) మధ్య గ్యాప్ తగ్గిపోయింది. ఒకప్పుడు అయితే అభిమాన నటులుపై ఫ్యాన్స్ కురిపించే ప్రేమ, అభిమానాలు వారికి రీచ్ అయ్యేవి కాదు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా(Social Media) ఆ గ్యాప్‌ను ఫిల్ చేసింది. తమ  మూవీస్ అప్‌డేట్స్‌ను పంచుకోవడమే కాకుండా లైవ్ చాట్స్‌తో హీరోహీరోయిన్లు ఫ్యాన్స్‌ను అలరిస్తున్నారు. అంతేకాదు తన లైఫ్‌లో జరిగే మేజర్ ఇన్సిడెంట్స్ గురించి వారితో పంచుకుంటున్నారు.  ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో ‘త్రోబ్యాక్’ పిక్స్(Throwback Pics) ట్రెండ్ కొనసాగుతూనే ఉంది. హీరో, హీరోయిన్లు వీలు కుదిరినప్పుడు తమ చైల్డ్‌హుడ్ ఫోటోలు(Childhood Photos) సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ కోవలోనే తాజాగా ఓ స్టార్ హీరోయిన్ బర్త్ డే సందర్భంగా.. ఆమె చైల్డ్‌హుడ్ పిక్ నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది.అమాయకంగా ఓ వైపు తీక్షణంగా చూస్తున్న ఈ చిన్నారి.. ఇప్పుడు కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్ అయింది.  అందం, అభినయంతో ప్రేక్షకుల మనస్సుల్లో చెరగని ముద్ర వేసుకుంది ఈ బ్యూటీ. తెలుగులో స్టార్ హీరోలు అందరి సరసన నటించింది. ఎవరో ఇంకా గుర్తుపట్టలేదా..?. ఇక మేమే చెప్పేస్తాం. ఈ ఫోటోలో ఉంది శృతిహాసన్.

స్టార్​ హీరోయిన్​ శృతి హాసన్ పుట్టినరోజు నేడు (జనవరి 28). 1986 జనవరి 28న జన్మించింది శృతి. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో గుర్తింపు పొందింది. చైల్డ్​ ఆర్టిస్ట్​గా పలు చిత్రాల్లో పాటలు పాడిన శృతి.. తండ్రి కమల్ హాసన్ డైరెక్ట్ చేసిన ‘హే రామ్’​ చిత్రంలోనూ మెరిసింది. 2009లో హిందీ మూవీ ‘లక్’​తో అరంగేట్రం చేసింది. అయితే ఆమెకు మాత్రం లక్​ కలిసి రాలేదు. ఆ తర్వాత తెలుగులో ‘ఓ మై ఫ్రెండ్’, ‘అనగనగా ఓ ధీరుడు’ వంటి సినిమాలు చేసినా.. విజయం దక్కలేదు. పవన్ కల్యాణ్ సరసన నటించిన  ‘గబ్బర్​సింగ్’​తో ఆమె స్టార్ మారిపోయింది. ఇక అప్పటి నుంచి వెనుదిరిగి చూసుకోలేదు. ‘బలుపు’, ‘రేసు గుర్రం’, ‘శ్రీమంతుడు’, ‘క్రాక్’​, ‘వకీల్​సాబ్​’ వంటి హిట్ చిత్రాలతో తెలుగులో స్టార్ హీరోయిన్ గా రాణిస్తోంది. ప్రస్తుతం ప్రభాస్​తో కలిసి పాన్ ఇండియా మూవీ ‘సలార్’​లో నటిస్తోంది. తన కెరీర్ ఇంకా మంచిగా ముందుకు వెళ్లాలని శృతికి హ్యాపీ బర్త్ డే చెప్పేద్దామా..!

Also Read: Chittoor district: నాటుబాంబును కొరికిన శునకం.. తల ఛిద్రమై స్పాట్‌లోనే మృతి

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!