Shriya Saran: పిల్లలు పుట్టాక ప్రపంచం మారుతుంది.. బాధ్యతలు పెరుగుతాయి : శ్రియ

కొంతకాలం సినిమాలకు గ్యాప్ ఇచ్చిన శ్రియ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరించడానికి రెడీ అవుతుంది. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించిన శ్రియ..

Shriya Saran:   పిల్లలు పుట్టాక ప్రపంచం మారుతుంది.. బాధ్యతలు పెరుగుతాయి : శ్రియ
Shirya
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 08, 2021 | 8:19 PM

Shriya Saran: కొంతకాలం సినిమాలకు గ్యాప్ ఇచ్చిన శ్రియ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరించడానికి రెడీ అవుతుంది. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించిన శ్రియ.. ఇప్పుడు గమనం అనే ఎమోషనల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. గమనం సినిమాతో సంజనా రావు దర్శకురాలిగా పరిచయం కాబోతోన్నారు. శ్రియా సరన్, శివ కందుకూరి, ప్రియాంక జవాల్కర్, నిత్యా మీనన్ ప్రధాన పాత్రలను పోషించారు. క్రియ ఫిల్మ్ కార్ప్, కలి ప్రొడక్షన్స్ బ్యానర్లపై రమేష్ కురుటూరి, వెంకీ పుష్పదపు, జ్ఞానశేఖర్ వి.ఎస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. గమనం సినిమాను డిసెంబర్ 10న విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ శ్రియా సరన్  మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను పంచుకుంది. శ్రియ మాట్లాడుతూ.. ఇది వరకు నేను మహిళ దర్శకురాళ్లతో పని చేశాను. మిడ్ నైట్ స్టోరీస్ అని ఓ సినిమా చేశాను. కన్నడలో కూడా ఓ చిత్రం చేశాను. తెలుగులో మాత్రం ఇలా మహిళా దర్శకురాలితో చేయడం మొదటిసారి అని అంది. మహిళా దర్శకురాళ్లతో పని చేయడం ఎంతో కంఫర్ట్‌గా ఉంటుంది. వ్యక్తిగత సమస్యలున్నా కూడా ఎంతో ఓపెన్‌గా చెప్పొచ్చు. ఇంతకు ముందు మహిళలు కెమెరా వెనకాల ఉండేవారు. కానీ ఇప్పుడు కెమెరా ముందు కూడా కనిపిస్తున్నారు అని చెప్పుకొచ్చింది.

వ్యక్తిగత జీవితం గురించి మాట్లడుతూ.. ప్రెగ్నెన్సీ తరువాత చాలా మార్పులు వచ్చాయి. కానీ వర్కవుట్లు చేసి, కథక్ డ్యాన్స్ చేస్తూ ఫిట్ నెస్ మీద దృష్టి పెట్టాను. పైగా మా అమ్మ నాకు చిన్నప్పటి నుంచి యోగాను నేర్పించారు. యోగా చేయడం వల్ల ఆరోగ్యం, ఫిట్ నెస్ అంతా బాగుంటుంది అని అంటుంది శ్రియ. అలాగే పిల్లలు పుట్టాక ప్రపంచం మారుతుంది. మనకు బాధ్యతలు పెరుగుతాయి. మనిషిలో మార్పులు వస్తాయి. ఇప్పుడు మేం ఎక్కడికి వెళ్లినా మా పాపను తీసుకుని వెళ్తున్నాం అని చెప్పుకొచ్చింది శ్రియ.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Lasya Manjunath: అరవిరిసిన లాస్యం గులాబీ పువ్వుల నవ్వుతు ఫోజులిచిన్న యాంకరమ్మ

క్యూట్‏నెస్‏తో కట్టి పడేస్తున్న ఈ చిన్నారి ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న బ్యూటీ.. ఎవరో గుర్తుపట్టారా ?

Samantha: కష్టపడి కెరీర్ నిర్మించుకున్నాను.. ఇప్పుడు నా కలలన్నీ శిథిలమైపోయాయి.. సమంత ఎమోషనల్