GAMANAM Pre Release Event: ఘనంగా గమనం ప్రీరిలీజ్ ఈవెంట్.. గెస్ట్ ఎవరంటే..

గమనం సినిమాతో సంజనా రావు దర్శకురాలిగా పరిచయం కాబోతోన్నారు. శ్రియా సరన్, శివ కందుకూరి, ప్రియాంక జవాల్కర్, నిత్యా మీనన్ ప్రధాన పాత్రలను పోషించారు.

GAMANAM Pre Release Event: ఘనంగా గమనం ప్రీరిలీజ్ ఈవెంట్.. గెస్ట్ ఎవరంటే..
Gamanam
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 08, 2021 | 8:10 PM

GAMANAM : గమనం సినిమాతో సంజనా రావు దర్శకురాలిగా పరిచయం కాబోతోన్నారు. శ్రియా సరన్, శివ కందుకూరి, ప్రియాంక జవాల్కర్, నిత్యా మీనన్ ప్రధాన పాత్రలను పోషించారు. క్రియ ఫిల్మ్ కార్ప్, కలి ప్రొడక్షన్స్ బ్యానర్లపై రమేష్ కురుటూరి, వెంకీ పుష్పదపు, జ్ఞానశేఖర్ వి.ఎస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. గమనం సినిమాను డిసెంబర్ 10న విడుదల కానుంది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో మూవీ ప్రమోషన్స్ వేగవంతం చేశారు చిత్రయూనిట్.

తాజాగా ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరుగుతుంది. శర్వానంద్, దర్శకుడు దేవాకట్టా ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఇక ఈ సినిమాలు మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ మలయాళ భాషల్లో ఈ సినిమా రూపొందుతోంది.పెళ్లైన తర్వాత సిల్వర్‌ స్ర్కీన్‌పై పెద్దగా కనిపించని శ్రియ ఇప్పుడు వరుసగా సినిమాల్లో బిజీగా మారుతోంది. ఇప్పటికే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాలో ఆమె పాత్రకు సంబంధించిన లుక్స్‌ సినీ ప్రియులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. కాగా ఆమె ప్రధాన పాత్రలో నటిస్తోన్న మరో చిత్రం ‘గమనం’ సినిమా ఎమోషనల్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Lasya Manjunath: అరవిరిసిన లాస్యం గులాబీ పువ్వుల నవ్వుతు ఫోజులిచిన్న యాంకరమ్మ

క్యూట్‏నెస్‏తో కట్టి పడేస్తున్న ఈ చిన్నారి ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న బ్యూటీ.. ఎవరో గుర్తుపట్టారా ?

Samantha: కష్టపడి కెరీర్ నిర్మించుకున్నాను.. ఇప్పుడు నా కలలన్నీ శిథిలమైపోయాయి.. సమంత ఎమోషనల్