Sirivennela Seetharama Sastry: సిరివెన్నెల చివరి పాట విశేష స్పందన.. ఆకట్టుకుంటున్న “శ్యామ్ సింగరాయ్” సాంగ్..
Sirivennela song: లెజెండరీ లిరిసిస్ట్ సిరివెన్నెల సీతారామశాస్త్రి చివరి పాట న్యాచులర్ స్టార్ నాని శ్యామ్ సింగ రాయ్ సినిమా కోసం రాశారు.
Shyam Singha Roy : లెజెండరీ లిరిసిస్ట్ సిరివెన్నెల సీతారామశాస్త్రి చివరి పాట న్యాచులర్ స్టార్ నాని శ్యామ్ సింగ రాయ్ సినిమా కోసం రాశారు. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ సినిమాకు రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. శాస్త్రిగారి అంతిమ సంస్కారాలు నిర్వహించిన రోజున సిరివెన్నెల పాట రికార్డ్ చేయబడింది. శ్యామ్ సింగ రాయ్ సినిమాను సిరివెన్నెల సీతారామ శాస్త్రిగారికి అంకితం ఇచ్చారు మేకర్స్. రీసెంట్ గా సిరివెన్నెల చివరి పాటను విడుదలచేశారు. ఇక ఈ పాట శ్రోతలను ఆకట్టుకుంటుంది. ఇప్పటికే ఈ పాట యూట్యూబ్ లో వైరల్ గా మారింది. ఈ పాటకు ఒక్క డిస్ లైక్ కూడా రాలేదు. ఇది నిజంగా విశేషమనే చెప్పాలి. అలాగే 121 కే లైకులు రాగా.. దాదాపు 4 మిలియన్ వ్యూస్ ను దక్కించుకుంది.
నాని, సాయి పల్లవిల మధ్య ఉన్న ఆహ్లాదకరమైన ప్రేమ కథను చిత్రీకరించే ఈ మనోహరమైన పాటకుమిక్కీ జె మేయర్ సంగీతం అందించాడు. నాని, సాయి పల్లవి కేవలం రాత్రులలోనే కలుస్తారు. వారు కలిసిన ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తుంది సాయి పల్లవి. వారు సినిమా హాలు, ఇతర ప్రదేశాలకు వెళ్తుంటారు. వారిద్దరి మధ్య క్లాసిక్ కెమిస్ట్రీ ఈ పాటకు మరింత అందాన్ని తెచ్చింది. సిరివెన్నెలగారి సాహిత్యం లోతైన అర్థాన్ని కలిగి ఉంది. అనురాగ్ కులకర్ణి ఈ పాటను మనోహరంగా పాడారు. సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి సత్యదేవ్ జంగా కథను అందించారు. మెలోడి స్పెషలిస్ట్ మిక్కీ జే మేయర్ అద్భుతమైన సంగీతాన్ని అందిస్తుండగా.. జాన్ వర్గీస్ కెమెరామెన్‌గా పని చేస్తున్నారు. నవీన్ నూలి ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రాహుల్ రవీంద్రన్, మురళీ శర్మ, అభినవ్ గోమటం వంటి వారు ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రం దక్షిణాది అన్ని భాషల్లో డిసెంబర్ 24న విడుదల కానుంది.
మరిన్ని ఇక్కడ చదవండి :