Syed Sohel Ryan: బూట్‌కట్ బాలరాజుగా బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్.. హీరోయిన్‌గా వకీల్ సాబ్ భామ..
ప్రముఖ బుల్లితెర రియాలిటీ షో 'బిగ్‌బాస్' ద్వారా బాగా గుర్తింపు తెచ్చుకున్న వారిలో సయ్యద్ సొహైల్ ఒకడు. అప్పటిదాకా యూట్యూబ్ వీడియోలు, చిన్న చిన్న పాత్రలు చేస్తూ వచ్చిన సయ్యద్ బిగ్‌బాస్-4 సీజన్‌తో ఎనలేని క్రేజ్‌ను తెచ్చుకున్నాడు
ప్రముఖ బుల్లితెర రియాలిటీ షో ‘బిగ్‌బాస్’ ద్వారా బాగా గుర్తింపు తెచ్చుకున్న వారిలో సయ్యద్ సొహైల్ ఒకడు. అప్పటిదాకా యూట్యూబ్ వీడియోలు, చిన్న చిన్న పాత్రలు చేస్తూ వచ్చిన సయ్యద్ బిగ్‌బాస్-4 సీజన్‌తో ఎనలేని క్రేజ్‌ను తెచ్చుకున్నాడు. ముఖ్యంగా ‘ కథ వేరే ఉంటది’ అంటూ మేనరిజమ్‌తో చెప్పిన డైలాగ్ అతనికి ఎంతోమంది అభిమానులను తెచ్చిపెట్టింది. 100 రోజులపాటు బిగ్‌బాస్ హౌస్‌లో సందడి చేసిన ఈ కరీంనగర్ కుర్రాడు టైటిల్ గెలవకపోయినా ఆ షోలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాడు. ఇక హౌస్ నుంచి బయటకు వచ్చిన సొహైల్ ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ అనే సినిమాలో హీరోగా నటిస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా అతని రెండో సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది.
‘బూట్ కట్ బాలరాజు’ అనే వెరైటీ టైటిల్‌తో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాకు కోనేటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నారు. ‘వకీల్‌సాబ్’ ముద్దుగుమ్మ, మరో తెలంగాణ అమ్మాయి అనన్య నాగళ్ల సొహైల్ పక్కన స్ర్కీన్ షేర్ చేసుకోనుంది. ప్రముఖ నిర్మాత బెక్కం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కాగా బుధవారం పూజా కార్యక్రమాలతో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత దిల్ రాజు క్లాప్‌నివ్వగా.. ‘అఖండ’ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. మరో స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి మొదటి షాట్‌కు దర్శకత్వం వహించాడు. జనవరి, ఫిబ్రవరిలో వరుసగా షెడ్యూల్స్ జరిపి త్వరగా సినిమాను పూర్తి చేస్తామని దర్శక నిర్మాతలు ప్రకటించారు.
.@RyanSohel and @AnanyaNagalla ⭐ing #BootcutBalaraju begins with a Pooja Ceremony today
? by #DilRaju First shot direction @AnilRavipudi ? Switch on #MiryalaRavinderReddy
Directed by #SreeKoneti Produced by @BekkemVenugopal#Basha @luckymediaoff #Globalfilms pic.twitter.com/krNB9yUu12
— VamsiShekar (@UrsVamsiShekar) December 8, 2021
Also Read:
Ravi Teja : మరోసారి గొంతు సవరించనున్న మాస్ రాజా.. దేవీ శ్రీ కోసం సింగర్‌గా రవితేజ..
Pushpa Trailer : రికార్డుల వేట మొదలుపెట్టిన పుష్పరాజ్.. తగ్గేదే లే అంటూ దూసుకుపోతున్న ట్రైలర్..