Pushpa: అప్పుడు లయన్ కింగ్.. ఇప్పుడు పుష్ప.. బన్నీ కోసం మరోసారి గొంతు సవరించుకుంటోన్న బాలీవుడ్ క్రేజీ హీరో..
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం ‘పుష్ప’. పుష్పరాజ్ ప్రియురాలు శ్రీవల్లి పాత్రలో రష్మిక మందన కనిపించనుంది. మలయాళ నటుడు ఫాహిద్ ఫాజిల్, అనసూయ, అజయ్ తదితరులు ప్రధాన పాత్రలు
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం ‘పుష్ప’. పుష్పరాజ్ ప్రియురాలు శ్రీవల్లి పాత్రలో రష్మిక మందన కనిపించనుంది. మలయాళ నటుడు ఫాహిద్ ఫాజిల్, అనసూయ, అజయ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ‘ఆర్య’, ‘ఆర్య2’ తర్వాత బన్నీ- సుకుమార్ కాంబినేషన్‌లో వస్తోన్న హ్యాట్రిక్ చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. అందుకు తగ్గట్టే ఇప్పటివరకు విడుదలైన టీజర్లు, గ్లింప్స్, పాటలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక ఇటీవల విడుదలైన ‘పుష్ప’ ట్రైలర్ యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తోంది. కాగా పాన్ ఇండియా స్థాయిలో రూపొందిన ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానున్న సంగతి తెలిసిందే. మొత్తం రెండు భాగాలుగా రానున్న ఈ సినిమా మొదటి పార్ట్ డిసెంబర్ 17న ప్రేక్షకుల మందుకు రానుంది.
కాగా ఈ సినిమాతో బాలీవుడ్ మార్కెట్‌కు సైతం తన స్టామినాను చూపించే పనిలో ఉన్నాడు బన్నీ. అందుకు తగ్గట్లే హిందీలో విడుదలైన ‘పుష్ప’ ట్రైలర్ రికార్డు స్థాయిలో వ్యూస్ సొంతం చేసుకుంటోంది. కాగా ఈ సినిమాను ఏఏ సినిమాస్ సంస్థ హిందీలో విడుదల చేస్తోంది. ఈ సినిమా హిందీ వెర్షన్ కోసం అల్లు అర్జున్‌కు బాలీవుడ్ క్రేజీ హీరో శ్రేయస్ తల్పడే డబ్బింగ్ చెప్పనున్నాడు. ‘గోల్‌మాల్’ సిరీస్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రేయస్ బన్నీకి డబ్బింగ్ చెప్పడం ‘పుష్ప’ సినిమాకు ప్లస్ అవుతుందనే చెప్పవచ్చు. ఎందుకంటే అతనికి సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. గతంలో ప్రముఖ హాలీవుడ్ సినిమా’లయన్ కింగ్’ హిందీ వెర్షన్ కు కూడా ఈ క్రేజీ హీరోనే డబ్బింగ్ చెప్పాడు. కాగా ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న శ్రేయస్ ఇండియాలోనే మోస్ట్ పవర్ ఫుల్ అండ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు డబ్బింగ్ చెప్పినందుకు తనకు చాలా గర్వంగా ఉందని చెప్పుకొచ్చాడు.
Also read:
Pushpa Trailer : రికార్డుల వేట మొదలుపెట్టిన పుష్పరాజ్.. తగ్గేదే లే అంటూ దూసుకుపోతున్న ట్రైలర్..
Vamshi Paidipally: భారీ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్న వంశీ పైడిపల్లి.. హీరోలుగా ఎవరంటే..!