AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood Drugs Case: సంచలనం రేకెత్తించి తుస్సుమన్న టాలీవుడ్ డ్రగ్స్ కేసు.. ఈడీ కేసులో కూడా సినీ ప్రముఖులకు క్లీన్‌చిట్..

Tollywood Drugs Case: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన టాలీవుడు డ్రగ్స్ కేసులో .. సినీ నటీనటులకు క్లిన్ చిట్ లభించింది. ఇప్పటికే తెలంగాణ ఎక్సైజ్ శాఖ అధికారులు..

Tollywood Drugs Case: సంచలనం రేకెత్తించి తుస్సుమన్న టాలీవుడ్ డ్రగ్స్ కేసు.. ఈడీ కేసులో కూడా సినీ ప్రముఖులకు క్లీన్‌చిట్..
Tollywood Drugs Case
Surya Kala
|

Updated on: Dec 08, 2021 | 5:53 PM

Share

Tollywood Drugs Case: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన టాలీవుడు డ్రగ్స్ కేసులో .. సినీ నటీనటులకు క్లిన్ చిట్ లభించింది. ఇప్పటికే తెలంగాణ ఎక్సైజ్ శాఖ అధికారులు సినీ ప్రముఖులకు క్లిన్ చిట్ ఇవ్వగా తాజాగా ఈడీ కూడా ఈ కేసులో వీరికి క్లిన్ చిట్ ఇచ్చింది. దీంతో తెలుగు చలన చిత్ర పరిశ్రమకు ఉన్న డ్రగ్స్ మరక తొలగిపోయింది. టాలీవుడు డ్రగ్స్ కేసులో ఈడీ విచారణ ముగిసింది. డ్రగ్స్ దిగుమతులతో పాటు… ఆర్ధిక లావాదేవీలు, నిధుల మల్లింపులపై సినీ ప్రముఖలను 12మందిని చాలా కాలం ఈడీ విచారణ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈడీ విచారణలో సరైన అధరాలు లభించలేదని దీంతో ఈ కేసుని క్లోజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి అనూహ్య పరిణామాల మధ్య విచారణ ప్రారంభించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్‌ కూడా ఎలాంటి ఆధారాలు లేవని.. తమ కేసును కూడా క్లోజ్ చేస్తోంది. ఫెమా, హవాలా సంబంధించిన ఆధారాలు లభ్యం కానందున ఈడీ కేసులో కూడా సినీ ప్రముఖులకు క్లీన్‌ చిట్‌ లభించింది. దీంతో గత నాలుగేళ్లకుపైగా మానసికంగా ఇబ్బంది పడుతున్న ఆరోపణలు ఎదుర్కొంటున్ననటీనటులకు బిగ్ రిలీఫ్ దక్కింది. ఇప్పటి వరకూ ఆయా తారలపై ఉన్న అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి.

2017లో భరత్ మరణం తర్వాత టాలీవుడ్ లో డ్రగ్స్ అంటూ సంచలన ఆరోపణలు వినిపించాయి. కెల్విన్ మార్కెరాన్స్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయడంతో టాలీవుడ్‌లో డ్రగ్స్ వ్యవహారం తెరపైకి వచ్చింది. సీనియర్ ఐపీఎస్ అధికారి అకున్ సభర్వాల్ నేతృత్వంలోని డ్రగ్స్ కేసు విచారణ ప్రారంభమైంది. అప్పట్లో దాదాపు రవితేజ, పూరి, ఛార్మి, ముమైత్ ఖాన్ ఇలా 60 మంది వరకూ విచారించారు. వీరిద్దగ్గర నుంచి శాంపిల్స్ తీసుకున్నారు. అనంతరం కొన్ని నెలల పాటు కేసు మాట వినిపించలేదు అనూహ్యంగా మళ్ళీ 2018 జూలైలో మళ్ళీ డ్రగ్స్ విషయం వెలుగులోకి వచ్చింది. 2020 సెప్టెంబర్‌లో చార్జిషీట్లు దాఖలు చేశారు. ఆబ్కారీ దర్యాప్తు ముగిసిన అనంతరం 2021 ఆగస్టులో ఈడీ అధికారులు మళ్ళీ కొత్తగా కేసుని నమోదు చేశారు. ఆంటీకాదు డ్రగ్స్ కేసులో ప్రముఖ దర్శకుడు రవితేజ, పూరి జగన్నాథ్, రానా, రకుల్ ప్రీతి సింగ్, ఛార్మి ల సహా 12మందిని విచారించారు. అయితే తమ విచారణలో ఎటువంటి అధరాలు లభ్యం కాలేదని ఈడీ ఈ కేసును క్లోజ్ చేసే దిశగా వెళ్తున్నట్లు తెలుస్తోంది.

Also Read:  మెగాస్టార్ చిరుతో స్టెప్స్ వేయడానికి జబర్దస్త్ భామ రష్మీ గౌతమ్ షాకింగ్ రెమ్యునరేషన్..