Chiranjeevi-Rashmi: మెగాస్టార్ చిరుతో స్టెప్స్ వేయడానికి జబర్దస్త్ భామ రష్మీ గౌతమ్ షాకింగ్ రెమ్యునరేషన్..
Chiranjeevi-Rashmi: మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత వరుస సినిమాలను లైన్‌లో పెట్టారు. ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమా ప్రారంభోత్సవం చేసి.. వన్ బై వన్ చక చకా...
Chiranjeevi-Rashmi: మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత వరుస సినిమాలను లైన్‌లో పెట్టారు. ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమా ప్రారంభోత్సవం చేసి.. వన్ బై వన్ చక చకా కంప్లీట్ చేస్తున్నారు. ఇప్పటికే చిరంజీవి పుట్టిన రోజున కొత్త సినిమాలు అనౌన్స్ చేశారు. చిరు చేస్తున్న సినిమాల్లో ఆచార్య షూటింగ్ కంప్లీట్ అయి రిలీజ్ కు రెడీ అవగా.. తాజాగా భోళాశంకర్ మూవీ షూటింగ్ జరుపుకుంటోంది. తమిళ మూవీ వేదాళంకు రీమేక్‌గా మెహర్ రమేష్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. అయితే ఈ సినిమాలో ఒక ఐటెం సాంగ్ కోసం రష్మీ గౌతమ్‌ను తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో మెగా అభిమానుల్లో సరికొత్త ఆసక్తి నెలకొంది. మెగాస్టార్ సరసన జబర్దస్త్ బ్యూటీ రష్మీ చిందులేస్తే చూడాలనే కుతూహలంతో ఎదురు చూస్తున్నారు.
చిరంజీవితో ఐటెం సాంగ్ చేయడానికి గాను రష్మీ భారీగానే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు టాక్ నడుస్తోంది. మెగాస్టార్‌తో స్టెప్పేసే అవకాశం వచ్చినా రష్మి ఏమాత్రం తగ్గలేదట.. ఈ ఐటమ్ సాంగ్‌లో చేయడానికి భారీగానే డిమాండ్ చేసిందట. ఒక్క పాట కోసం ఆమెకు దాదాపు 40 లక్షల వరకు రెమ్యునరేషన్ ఇస్తున్నారని చెప్పుకుంటున్నారు. దాంతో రష్మీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోతున్నారు. ఇది రష్మీకి గోల్డెన్ ఆఫర్ లాంటిదని, చిరుతో స్టెప్పులేసి థియేటర్లలో రష్మీ గోల పెట్టించబోతోందని చెప్పుకుంటున్నారు. మరికొద్ది రోజుల్లోనే రష్మీ- చిరంజీవిల కాంబోలో ఈ సాంగ్ సెట్స్ మీదకు రానుందట. దీనికి శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించబోతున్నారని, ఈ సాంగ్ కోసం రష్మిని రిఫర్ చేసింది కూడా శేఖర్ మాస్టారే అనే టాక్ నడుస్తోంది. అంతేకాదు ఈ పాట సినిమాకే హైలైట్ అవుతుందని అంటున్నారు.
Also Read: పెంపుడు కుక్క గోపీ పుట్టినరోజు వేడుకను సంప్రదాయంగా నిర్వహించిన సుధామూర్తి.. వీడియో వైరల్