AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Katrina Kaif- Vicky Kaushal: ఆ మూస ధోరణిని మీరు బ్రేక్‌ చేశారంటూ విక్ర్టీనా వివాహంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కంగన..

ప్రేమ బంధాన్ని మూడుముళ్ల బంధంగా మార్చుకుంటూ మరికొన్ని గంటల్లో పెళ్లిపీటలెక్కనున్నారు బాలీవుడ్‌ లవ్‌ బర్డ్స్‌ కత్రినా కైఫ్‌ - విక్కీ కౌశల్‌. రాజస్థాన్‌లోని సవాయి మాధోపూర్‌లోని

Katrina Kaif- Vicky Kaushal: ఆ మూస ధోరణిని మీరు బ్రేక్‌ చేశారంటూ విక్ర్టీనా వివాహంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కంగన..
Follow us
Basha Shek

|

Updated on: Dec 08, 2021 | 5:27 PM

ప్రేమ బంధాన్ని మూడుముళ్ల బంధంగా మార్చుకుంటూ మరికొన్ని గంటల్లో పెళ్లిపీటలెక్కనున్నారు బాలీవుడ్‌ లవ్‌ బర్డ్స్‌ కత్రినా కైఫ్‌ – విక్కీ కౌశల్‌. రాజస్థాన్‌లోని సవాయి మాధోపూర్‌లోని ‘సిక్స్ సెన్సెస్ ఫోర్ట్’ అనే విలాసవంతమైన హోటల్‌ ఈ వివాహ వేడుకకు వేదిక కానుంది. ఇప్పటికే ప్రి వెడ్డింగ్‌ వేడుకలు ప్రారంభంకాగా డిసెంబర్ 9న సాయంత్రం ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో కత్రినా, విక్కీలు ఏడడుగులు నడవనున్నారు. కాగా హాంకాంగ్‌లో పుట్టిన కత్రినా లండన్‌లో పెరిగింది. ఆతర్వాత బాలీవుడ్‌లో అడుగుపెట్టి స్టార్‌ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం క్యాట్‌ వయసు 38 ఏళ్లు కాగా.. తనకంటే చిన్నవాడైన విక్కీ కౌశల్‌(33)తో కలిసి వైవాహిక బంధంలో అడుగుపెట్టనుంది. ఈ నేపథ్యంలో ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే మరో బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ విక్ర్టీనా వివాహంపై స్పందించింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌రీల్స్‌లో ఓ ఆసక్తికర పోస్ట్‌ పెట్టింది.

‘జీవితంలో విజయవంతమైన, ధనవంతులైన పురుషులు చాలా తక్కువ వయసు గల అమ్మాయిలను పెళ్లి చేసుకోవడం గురించి చాలా కథలు విన్నాం .. అదేవిధంగా మహిళలు తమ భర్త కంటే ఎక్కువగా విజయవంతమైనా, ఎక్కువ డబ్బులు సంపాదించినా ఒక పెద్ద తప్పుగా భావించడం మనం చూస్తూనే ఉన్నాం. ఇక పెళ్లి వయసు దాటిన తర్వాత అమ్మాయిలకు వివాహం అసాధ్యమని, తమ కంటే చిన్న వయసు వాడిని వివాహం చేసుకోడం కుదరదని చాలామంది అనుకుంటారు. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో దాగున్న ఈ మూసధోరణులను కత్రినా, విక్కీలు బ్రేక్‌ చేసినందుకు సంతోషంగా ఉంది. చరిత్రను తిరగరాసినందుకు వారికి అభినందనలు’ అంటూ రాసుకొచ్చిందీ కంగనా.

Also read:

Allu Arjun Pushpa: మొదలైన పుష్పరాజ్‌ రికార్డుల వేట… రిలీజ్ వరకు ఆగలేం అంటున్న ఫ్యాన్స్.. (వీడియో)

Samantha: విడాకులపై మొదటిసారి సమంత అంతులేని మనోవేదన.. నా కలలన్నీ శిథిలమైపోయాయి అంటూ..(వీడియో)

Thank You Movie: నాగచైతన్య ‘థాంక్యూ’ సినిమా పై రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్