Sudha Murthy: పెంపుడు కుక్క గోపీ పుట్టినరోజు వేడుకను సంప్రదాయంగా నిర్వహించిన సుధామూర్తి.. వీడియో వైరల్
Sudha Murthy: చాలా మంది పెంపుడు జంతువులను తమ కుటుంబ సభ్యులతో సమానంగా ప్రేమిస్తారు. తమ పెంపుడు జంతువులకు సంబంధించిన పుట్టిన రోజు, శీమంతం వంటి వేడుకలను..

Sudha Murthy: చాలా మంది పెంపుడు జంతువులను తమ కుటుంబ సభ్యులతో సమానంగా ప్రేమిస్తారు. తమ పెంపుడు జంతువులకు సంబంధించిన పుట్టిన రోజు, శీమంతం వంటి వేడుకలను ఎంతో ఇష్టంగా జరుపుకుంటారు. అందుకు ఉదాహరణగా ఇప్పుడు ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ సుధా మూర్తి తమ పెంపుడు కుక్క పుట్టినరోజు సందర్భంగా హారతి ఇచ్చి సాంప్రదాయ రీతిలో జరుపుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వివరాల్లోకి వెళ్తే..
సుధా మూర్తి తన పెంపుడు కుక్క గోపి పుట్టినరోజు సందర్భంగా ఆశీర్వదించిన ఓ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియో నెటిజన్లను ఆకర్షిస్తోంది. సుధా మూర్తి, ఆమె సోదరి హారతి పళ్లెం పట్టుకొని గోపికి హారతి ఇచ్చి.. పుట్టినరోజ శుభాకాంక్షలు చెబుతూ ఆశీర్వదించారు. అనంతరం సుధా మూర్తి గోపి నుదుటిమీద కుంకుమ దిద్ది గోపీని దగ్గరకు తీసుకున్నారు. ఈ వీడియో ఇప్పటికే లక్షల వ్యూస్ సొంతం చేసుకుంది. కొంతమంది గోపి పుట్టిన రోజు శుభాకాంక్షలను చెబుతూ.. సుధామూర్తికి గోపితో ఉన్న అనుబంధానికి హర్షం వ్యక్తం చేస్తున్నారు. తాము కూడా ప్రేమగా గోపీకి హ్యాపీ బర్త్ డే విశేష్ చెబుతున్నారు.
This is so cute. Sudha Murty and her sister doing Arti for their dog Gopi on his birthday (via WhatsApp) pic.twitter.com/7q21FWeihe
— Chandra R. Srikanth (@chandrarsrikant) December 6, 2021
నిజానికి సుధామూర్తి గోపీ తో ఉన్న వీడియోలు ఎప్పటికప్పుడు తన ఇన్‌స్టాగ్రామ్ లో పంచుకుంటూనే ఉంటారు. అవి చాలా అందంగా మనసుకి హత్తుకునేలా ఉంటాయి. సెప్టెంబర్ లో సుధా మూర్తి, ట్వింకిల్ ఖన్నాతో కలిసి చక్కర్లు కొట్టిన గోపీ వీడియో కూడా ఎంతగానో నెటిజన్లను ఆకట్టుకుంది.
View this post on Instagram
Also Read: చైనాలో వింటర్ ఒలింపిక్స్ జరుగుతాయంటున్న ఐవోసీ.. దౌత్య బహిష్కరణ చేయాలంటూ అమెరికా పిలుపు
