AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raja Raja Chora: థియేటర్‌లో హిట్ టాక్ తెచ్చుకొని.. ఓటీటీ బాట పట్టిన శ్రీవిష్ణు సినిమా..

ఓటీటీ ఉండగా వినోదానికి లోటు ఉండదనేది వీక్షకులు చెప్పేమాట! తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ, గుజరాతీ...

Raja Raja Chora: థియేటర్‌లో హిట్ టాక్ తెచ్చుకొని.. ఓటీటీ బాట పట్టిన శ్రీవిష్ణు సినిమా..
Sri Vishnu
Rajeev Rayala
|

Updated on: Oct 08, 2021 | 12:01 PM

Share

Raja Raja Chora: ఓటీటీ ఉండగా వినోదానికి లోటు ఉండదనేది వీక్షకులు చెప్పేమాట! తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ, గుజరాతీ… పలు భారతీయ భాషల్లో, వివిధ జానర్లలో ఎప్పటికప్పుడు సరికొత్త వెబ్‌ సిరీస్‌లు, డైరెక్ట్‌–టు–డిజిటల్‌ రిలీజ్‌ మూవీస్‌తో పాటు కొత్త సినిమాలను వీక్షకులకు అందిస్తూ 24/7 వినోదాన్ని అందిస్తున్నాయి ఓటీటీలు. ప్రస్తుతం చాలా సినిమాలను డైరెక్ట్ డిజిటల్ చేసిన ప్రముఖ ఓటీటీ వేదిక… విజయదశమి కానుకగా వినోదాల విందు అందివ్వడానికి సిద్ధమైంది.

ప్రామిసింగ్ స్టార్ శ్రీ విష్ణు కథానాయకుడిగా నటించిన చిత్రం ‘రాజ రాజ చోర’. కరోనా సెకండ్ వేవ్ తర్వాత… ఆగస్టు 19న థియేటర్లలో విడుదలైంది. ప్రేక్షకులను నవ్వించడంతో పాటు మంచి సందేశం ఇచ్చింది. దసరా కానుకగా ఈ చిత్రాన్ని ‘జీ 5’ ఓటీటీ వేదికలో విడుదల చేయనున్నారు. హసిత్ గోలి దర్శకుడిగా పరిచయమైన ‘రాజ రాజ చోర’ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతోపాటు బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు సాధించింది. దొంగగా శ్రీ విష్ణు… అతని భార్యగా సునైన, ప్రేయసిగా మేఘా ఆకాష్, ఇతర పాత్రల్లో రవి బాబు, శ్రీకాంత్ అయ్యంగార్, అజయ్ ఘోష్, గంగవ్వ, తనికెళ్ల భరణి తదితరుల నటనకు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు లభించాయి. వివేక్ సాగర్ సంగీతం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ దసరాకు ఓటీటీలో ఇంటిల్లిపాది కలిసి చూస్తూ నవ్వుకునే సినిమా ‘రాజ రాజ చోర’ అవుతుందని అనడంలో ఎటువంటి సందేహం లేదు. మరి ఈ సినిమాను ఓటీటీలో ప్రేక్షకులు ఏస్థాయిలో ఆదరిస్తారో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Kondapolam Twitter Review : ‘కొండపోలం’లో కురుస్తున్న పాజిటివ్ వాన..

Madonna Sebastian : ముద్దుగుమ్మ మడోన్నా సెబాస్టియన్ మత్తెక్కించే ఫోజులు..

Cruise Drugs Case: మాఫియా ప‌ప్పులంద‌రూ రక్షణగా నిలుస్తున్నారు.. హృతిక్ రోష‌న్ సోషల్ మీడియా పోస్ట్‌పై కంగనా సెటైర్లు