AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రభాస్ హీరోయిన్ ఇంటిపై దాడి.. ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డ దుండగులు.. కారణం ఇదే

ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో బాలీవుడ్ నటి దిశా పటానీ ఇంటి దగ్గర శుక్రవారం తెల్లవారుజామున (సెప్టెంబర్ 12, 2025) కాల్పులు జరిగాయి. సివిల్ లైన్స్‌లోని విల్లా నంబర్ 40 వద్ద గుర్తు తెలియని దుండగులు బైక్‌పై వచ్చి 6-7 రౌండ్లు కాల్పులు జరిపారని తెలుస్తుంది. ఈ కాల్పులకు ఇద్దరు వ్యక్తులు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు

ప్రభాస్ హీరోయిన్ ఇంటిపై దాడి.. ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డ దుండగులు.. కారణం ఇదే
Disha Patani
Rajeev Rayala
|

Updated on: Sep 13, 2025 | 2:09 PM

Share

ఈమధ్య బాలీవుడ్ లో కాల్పుల వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. మొన్నామధ్య సల్మాన్ ఖాన్ ఇంటి పై దాడి. ఆయనను చంపేస్తామని బెదిరింపులు తెలిసిందే.. అలాగే సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి దుండగులు చొరబడటం వార్తలతో బాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. తాజాగా ఓ స్టార్ హీరోయిన్ ఇంటిముందు కాల్పులు కలకలం రేపాయి. ఆమె ఎవరో కాదు బాలీవుడ్ అందాల భామ దిశా పటని ఈ షాకింగ్ ఇన్సిడెంట్ ఉత్తరప్రదేశ్ లోని బరేల్లీలో జరిగింది. సెప్టెంబర్ 12, 2025 ఉదయం సుమారు 3-4:30 గంటల మధ్య, బైక్‌పై వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు దిశా పటానీ ఇంటి పై  ముందు 6-7 రౌండ్ల కాల్పులు జరిపారు. అదృష్టవశాత్తు ఎవరూ గాయపడలేదు. కానీ ఒక్కసారిగా ఆ ప్రాంతంలో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.

సడన్‌గా చూసి త్రీడి బొమ్మ అనుకునేరు..! ఈ సీరియల్ బ్యూటీ అందం ముందు ఎవరైనా దిగదుడుపే

అయితే ఈ కాల్పులకు కారణం దిశా సోదరి ఖుష్బూ పటానీ ఇన్‌స్టాగ్రామ్‌లో జూలైలో పోస్ట్ చేసిన కామెంట్స్‌. ఆమె హిందూ సాధువులైన ప్రేమానంద్ మహారాజ్ అలాగే అనిరుద్ధాచార్య మహారాజ్‌పై అవమానకరమైన వ్యాఖ్యలు చేసిందని తెలుస్తుంది. ఇది లైవ్-ఇన్ రిలేషన్‌షిప్స్ గురించి అనిరుద్ధాచార్య వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా ఆమె కొన్ని కామెంట్స్ చేసింది. దాంతో కొందరు ఆగ్రహించి ఈ పని చేశారని తెలుస్తుంది.

అనుకున్నదొక్కటీ అయ్యిందొక్కటి..! ఎలిమినేషన్‌లో ఊహించని ట్విస్ట్.. మొదటి వారం బయటకు వచ్చేది ఆమె..

కాగా ఈ కాల్పులు జరిగిన సమయంలో దిశా తల్లిదండ్రులు (తండ్రి జగదీష్ పటానీ, రిటైర్డ్ DSP),  దిశా సోదరి ఖుష్బూ ఇంట్లో ఉన్నారు. దిశా ముంబైలో షూటింగ్‌లో ఉండటంతో ఆమె అక్కడ లేదని తెలుస్తుంది. గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్, రోహిత్ గోదారా గ్యాంగ్ సభ్యులు విరేంద్ర చారణ్, మహేంద్ర సరణ్ ఫేస్‌బుక్ పోస్ట్ ద్వారా ఈ కాల్పులు చేసింది తామే అని ఒప్పుకున్నారు. పోస్ట్‌లో “సనాతన ధర్మానికి అవమానం చేస్తే మరింత తీవ్ర చర్యలు తీసుకుంటాం, ఇది ట్రైలర్ మాత్రమే” అని హెచ్చరించారు. దిశా తండ్రి ఫిర్యాదు మేరకు FIR నమోదు చేశారు పోలీసులు. దిశా ఇంటి చుట్టూ సెక్యూరిటీ పెంచారు. దాడి చేసినవారు ఢిల్లీ-లక్నో హైవే ద్వారా పారిపోయారని, ముందుగా రికీ చేశారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఛీ ఛీ.. ఇదేం పాడు సినిమారా బాబు.! డైరెక్టర్‌ను పిచ్చి కొట్టుడు కొట్టారు.. హీరోయిన్‌పై కూడా దాడి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.