Premanand Ji Maharaj: స్వామీజీకి కిడ్నీ దానం చేస్తానన్న స్టార్ హీరోయిన్ భర్త .. నటి రియాక్షన్ ఏంటంటే? వీడియో
సాధారణంగా భక్తులు దేవుళ్లకు, ఆలయాలకు, స్వామీజీలకు తమకు తోచిన విరాళాలు ఇస్తుంటారు. లేదా ఇంకేదో మంచి కార్యక్రమాలనైనా చేపడుతుంటారు. అయితే ఈ స్టార్ హీరోయిన్ భర్త ఏకంగా ఓ స్వామీజీకి తన కిడ్నీని దానం చేసేందుకు రెడీ అయ్యాడు. దీనికి ఆ స్వామీజీ కూడా..

ఉత్తరప్రదేశ్ కి చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక గురువు ప్రేమానంద్ మహారాజ్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఆయన దగ్గరకు వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలు తరచూ వస్తుంటారు. ముఖ్యంగా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ దంపతులు తరచుగా ఈ స్వామీజీ దగ్గరకు వస్తుంటారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా మథురలోని ప్రేమానంద్ మహారాజ్ ఆశ్రమాన్ని సందర్శించారు. స్వామీజీ ఆశీస్సలు తీసుకున్నారు ఈ సందర్భంగా శిల్పా శెట్టి, రాజ్ లకు ప్రేమానంద్ మహారాజ్ కొన్ని సలహాలు, సూచనలు అందించారు.
కాగా ప్రేమానంద్ మహారాజ్ రెండు కిడ్నీలు చెడిపోయాయి. గత పదేళ్లుగా ఆయన డయాలసిస్ చేయించుకుంటున్నారు. అయితే తనకు మరణ భయం లేదని శిల్పా దంపతులతో చెప్పుకొచ్చారు. ఇది విన్న రాజ్ కుంద్రా చేతులు జోడించి .. ‘ స్వామీజీ గత రెండు సంవత్సరాలుగా నేను మీ ప్రవచనాలు వింటూ మిమ్మల్ని అనుసరిస్తున్నాను. మీరు అనారోగ్యంతో బాధపడుతున్నారంటే నేను ఎలాంటి సందేహం లేకుండా ఒక మాట చెప్పగలను. మీకు ఒక కిడ్నీ ఇవ్వడానికి నేను ఎప్పుడూ సిద్ధమే. మీరు ఎంతో మందికి స్ఫూర్తి. నేను మీకు చేయగలిగిన సాయం ఇదొక్కటే’ అని అన్నారు. దీంతో రాజ్ మాటలు విని శిల్ప కూడా ఆశ్చర్యపోయింది. కానీ ప్రేమానంద్ మహారాజ్ శిల్పా శెట్టి భర్త అభ్యర్థనను తిరస్కరించారు. ‘నువ్వు ఆరోగ్యంగా ఉంటే నాకు చాలు. ‘నీ మాటలు నాకెంతో ఆనందాన్నిచ్చాయి. మనకు పిలుపువచ్చే వరకు ఈ లోకాన్ని విడిచి వెళ్లలేం. అలాగే దేవుడు పిలిచినప్పుడు అందరూ వెళ్లాల్సిందే’ అంటూ స్వామీజీ చెప్పుకొచ్చారు.
వీడియో ఇదిగో..
Shilpa Shetty और Raj Kundra से महाराज जी की क्या वार्ता हुई ? Bhajan Marg pic.twitter.com/33PyAQAMpk
— Bhajan Marg (@RadhaKeliKunj) August 14, 2025
శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా ఒక పెద్ద వ్యాపారవేత్త. కోట్లాది రూపాయల ఆస్తులు అతని పేరు మీద ఉన్నాయి. అయితే నిత్యం ఏదో ఒక వివాదంలో రాజ్ పేరు వినిపిస్తుంటుంది. ఇంతకు ముందు ఓ కేసులో భాగంగా చాలా కాలం జైలులో గడపవలసి వచ్చింది. ఇక రీసెంట్ గా ఒక ప్రముఖ వ్యాపారవేత్త శిల్పా, రాజ్ తనను రూ. 60 కోట్లు మోసం చేశారని కేసు పెట్టాడు.
భర్త రాజ్ కుంద్రాతో శిల్పా శెట్టి..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








