Aadavallu Meeku Joharlu: ‘ఆడాళ్ళు మీకు జోహార్లు’ టైటిల్ సాంగ్ ప్రోమో ఫుల్ సాంగ్ ఎప్పుడంటే..
యంగ్ హీరో శర్వానంద్ గత కొంత కాలంగా సరైన హిట్ లేక సతమతం అవుతున్నాడు. హిట్లు ప్లాప్ లను పట్టించుకోకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు

Aadavallu Meeku Joharlu: యంగ్ హీరో శర్వానంద్ గత కొంత కాలంగా సరైన హిట్ లేక సతమతం అవుతున్నాడు. హిట్లు ప్లాప్ లను పట్టించుకోకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. శర్వానంద్ (Sharwanand) ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం ఆడవాళ్లు మీకు జోహార్లు (Aadavallu Meeku Joharlu). ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు డైరెక్టర్ కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో శర్వానంద్ సరసన కన్నడ బ్యూటీ రష్మిక మందన్న (Rashmika Mandanna) నటిస్తోంది. ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ మీద సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ సినిమాపై ఆసక్తిని కలిగించాయి. ఈ సినిమాను ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రయూనిట్ తమ ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రకటించింది. ఎట్టకేలకు ఈ సినిమా ఫిబ్రవరిలో థియేటర్లలోకి రానుంది.
ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ స్పీడ్ పెంచిన చిత్ర బృందం.. టైటిల్ సాంగ్ ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ‘ఆడాళ్ళూ.. మీకు జోహార్లూ..’ అంటూ వచ్చిన ఈ గ్లిమ్స్ అలరిస్తోంది. ఇందులో శర్వానంద్ మహిళలకు నమస్తే చెబుతూ వేసిన స్టెప్పులు ఆకట్టుకుంటున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ ఈ పాటకు ట్యూన్ కంపోజ్ చేయడమే కాదు.. స్వయంగా ఆలపించారు. లిరిసిస్ట్ శ్రీమణి ఈ గీతానికి సాహిత్యం అందించారు. ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ టైటిల్ సాంగ్ పూర్తి లిరికల్ వీడియోని శుక్రవారం (ఫిబ్రవరి 4) సాయంత్రం 4.05 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ ప్రోమో పై మీరు ఓ లుక్కేయండి.
మరిన్ని ఇక్కడ చదవండి :




