AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vaishnav Tej: మెగా హీరో సినిమా నుంచి మరో అప్డేట్‌.. అలరిస్తోన్న రంగ రంగ వైభవంగా మెలోడీ సాంగ్‌..

వైష్ణవ్ తేజ్(Vaishnav Tej).. మొదటి సినిమాతోనే వంద కోట్ల మార్కును చేరుకున్న ఈ మెగా మేనల్లుడి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.

Vaishnav Tej: మెగా హీరో సినిమా నుంచి మరో అప్డేట్‌.. అలరిస్తోన్న రంగ రంగ వైభవంగా మెలోడీ సాంగ్‌..
Basha Shek
|

Updated on: Feb 03, 2022 | 10:31 PM

Share

వైష్ణవ్ తేజ్(Vaishnav Tej).. మొదటి సినిమాతోనే వంద కోట్ల మార్కును చేరుకున్న ఈ మెగా మేనల్లుడి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన ఉప్పెన (Uppena) సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ హీరో ఆతర్వాత క్రిష్ దర్శకత్వంలో కొండపొలం (Kondapolam) సినిమాలో నటించాడు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా మంచి టాక్ సంపాదించుకుంది కానీ కమర్షియల్ గా మాత్రం హిట్ కాలేకపోయింది. ఈ నేపథ్యంలో మళ్లీ విజయాల బాట పట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడీ యంగ్‌ హీరో. ఇందులో భాగంగా వైవిధ్యమైన కథలను ఎంచుకుంటున్నాడు. ప్రస్తుతం అతను ‘రంగరంగ వైభవంగా’ (Ranga ranga vaibhavanga) అనే చిత్రంలో నటిస్తున్నాడు. ‘రొమాంటిక్‌’ తో కుర్రకారు మనసులు కొల్లగొట్టిన కేతికా శర్మ మెగా హీరోతో రొమాన్స్ చేయనుంది.

కాగా ఈ చిత్రం ద్వారా అర్జున్ రెడ్డి తమిళ్ రిమేక్ అదిత్య వర్మ డైరెక్టర్ గిరీషాయ తెలుగు తెరకు పరిచయం కాబోతున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్ పీ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత బీవీఎస్ ఎన్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన రొమాంటిక్‌ టీజర్‌ అభిమానులను అలరిస్తుండగానే మరో అప్డేట్‌ ను విడుదల చేశారు దర్శక నిర్మాతలు. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్‌ సింగిల్‌ను విడుదల చేశారు. ‘తెలుసా తెలుసా ఎవరికోసం ఎవరు పుడతారో .. ఎవరికి ఎవరేమి అవుతారో’ అంటూ సాగే ఈ మెలోడీ సంగీత ప్రియులను అలరిస్తోంది. ప్రముఖ సంగీత దర్శకుడు శంకర్ మహదేవన్ ఆలపించగా.. శ్రీమణి సాహిత్యం అందించారు. రాక్‌స్టార్‌దేవీశ్రీ ప్రసాద్‌ బాణీలు సమకూర్చారు. కాగా కాలేజ్‌ లవ్‌స్టోరీ బ్యాక్‌డ్రాప్‌ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తోంది.

Also Read:Hero Movie: ఓటీటీలో అడుగుపెట్టనున్న మహేశ్‌ మేనల్లుడి సినిమా.. స్ర్టీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే..

Nani: మీరు రెండు డేట్లు ఫిక్స్‌ చేస్తే.. మేం ఏడు డేట్లు బ్లాక్‌ చేస్తాం.. తన సినిమాకు ఏడు విడుదల తేదీలను ప్రకటించిన నాని..

Sara Alikhan: అలాంటి పిచ్చి కామెంట్లకి నేను కుంగిపోను.. ట్రోలర్‌కి స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చిన సారా..