AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nani: మీరు రెండు డేట్లు ఫిక్స్‌ చేస్తే.. మేం ఏడు డేట్లు బ్లాక్‌ చేస్తాం.. తన సినిమాకు ఏడు విడుదల తేదీలను ప్రకటించిన నాని..

కరోనా సంక్షోభ సమయంలో 'వి', 'టక్‌ జగదీష్‌' సినిమాలను ఓటీటీలో విడుదల చేసి మిశ్రమ ఫలితాలు అందుకున్నారు నేచురల్‌ స్టార్‌ నాని (Nani).

Nani: మీరు రెండు డేట్లు ఫిక్స్‌ చేస్తే.. మేం ఏడు డేట్లు బ్లాక్‌ చేస్తాం.. తన సినిమాకు ఏడు విడుదల తేదీలను ప్రకటించిన నాని..
Nani
Basha Shek
|

Updated on: Feb 03, 2022 | 8:59 PM

Share

కరోనా సంక్షోభ సమయంలో ‘వి’, ‘టక్‌ జగదీష్‌’ సినిమాలను ఓటీటీలో విడుదల చేసి మిశ్రమ ఫలితాలు అందుకున్నారు నేచురల్‌ స్టార్‌ నాని (Nani). అయితే గతేడాది చివర్లో ‘శ్యామ్‌సింగరాయ్‌’ (Shyam Singharoy) గా మన ముందుకు వచ్చి బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ యంగ్‌ హీరో ‘అంటే సుందరానికీ’ (Ante Sundaraniki) అనే సినిమాలో నటిస్తున్నాడు. గతంలో ‘మెంటల్ మదిలో’, ‘బ్రోచేవారెవరురా’ లాంటి హిట్‌ సినిమాలు అందించిన వివేక్ ఆత్రేయ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ‘రాజారాణి’ ఫేం నజ్రియా నజీమ్‌ చాలా ఏళ్ల తర్వాత సిల్వర్‌ స్ర్కీన్‌పై కనిపించనుంది. కాగా ఇటీవల భీమ్లానాయక్‌, ఆర్‌ఆర్‌ఆర్‌ లాంటి కొన్ని సినిమాలు రెండేసి రిలీజ్‌ డేట్లను ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో తామేం తక్కువ కాదంటూ ‘అంటే.. సుందరానికీ!’ సినిమా విడుదల కోసం ఏకంగా ఏడు ముహూర్తాలు ఫిక్స్ చేశాడు నాని.

ఫుల్‌ ఆవకాయ సీజన్‌ బ్లాక్‌ చేశాం! ఈ సందర్భంగా ఏప్రిల్ 22 , ఏప్రిల్ 29, మే 6, మే 20, మే 27, జూన్ 3, జూన్ 10 తేదీలలో ఒక రోజు తన సినిమాను విడుదల చేయనున్నట్లు పోస్టర్ విడుదల చేశాడు నేచురల్‌ స్టార్‌. ‘మీరంతా రెండు రెండు బ్లాక్ చేస్తే మేము ఏడు చేయకూడదా? ఫుల్ ఆవకాయ సీజన్ బ్లాక్ చేశాం.. మెల్లగా డిసైడ్ చేస్తాం’ అంటూ అతను ఫన్నీగా చేసిన ట్వీట్‌ ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌ గా మారింది. కాగా ‘అంటే సుందరానికి’ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. హాస్యప్రధానంగా సాగే కథతో ఈ సినిమా రూపొందుతున్నట్లు తెలుస్తోంది. అందుకు తగ్గట్లే ఇటీవల విడుదలైన గ్లింప్స్‌ అభిమానులను బాగా ఆకట్టుకుంది.

Also Read:Sara Alikhan: అలాంటి పిచ్చి కామెంట్లకి నేను కుంగిపోను.. ట్రోలర్‌కి స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చిన సారా..

AHA Unstoppable: సీక్రెట్‌గా ఎందుకు పెళ్లి చేసుకున్నావ్‌? బాలయ్య ప్రశ్నకు మహేశ్‌ రియాక్షన్‌ చూడండి..

Rashmika Mandanna: కొత్త ఇంట్లోకి మారుతోన్న కన్నడ ముద్దుగుమ్మ!.. సామాన్లు ప్యాక్‌ చేసుకోవడం కష్టంగా ఉందంటూ..