Sara Alikhan: అలాంటి పిచ్చి కామెంట్లకి నేను కుంగిపోను.. ట్రోలర్‌కి స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చిన సారా..

సైఫ్ అలీఖాన్ (Saif Alikhan) వారసురాలిగా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది సారా అలీఖాన్‌ (Sara Alikhan). మొదటి సినిమా 'కేధార్‌నాథ్‌' సినిమాతోనే అటు అందం, ఇటు అభినయ పరంగా మంచి మార్కులు తెచ్చుకుంది

Sara Alikhan: అలాంటి పిచ్చి కామెంట్లకి నేను కుంగిపోను.. ట్రోలర్‌కి స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చిన సారా..
Sara Ali Khan
Follow us
Basha Shek

|

Updated on: Feb 03, 2022 | 7:57 PM

సైఫ్ అలీఖాన్ (Saif Alikhan) వారసురాలిగా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది సారా అలీఖాన్‌ (Sara Alikhan). మొదటి సినిమా ‘కేధార్‌నాథ్‌’ సినిమాతోనే అటు అందం, ఇటు అభినయ పరంగా మంచి మార్కులు తెచ్చుకుంది. ఆ తర్వాత ‘సింబా’, ‘లవ్‌ ఆజ్‌కల్‌2’, ‘అత్రంగిరే’ సినిమాలతో హిందీ సినిమా ప్రేక్షకులకు బాగా చేరువైంది. ముఖ్యంగా ఇటీవల విడుదలైన ‘అత్రంగిరే’ (Atrangire) సినిమాలో ఆమె అభినయం విమర్శకుల ప్రశంసలు పొందింది. ఇక సినిమాలతో పాటు సోషల్ మీడియా(social media) లోనూ ఎంతో యాక్టివ్‌ గా ఉంటుంది సారా. తన గ్లామరస్‌, ఫ్యాషనబుల్‌ ఫొటోలు షేర్‌ చేసుకోవడంతో పాటు తీరిక దొరికినప్పుడల్లా ఫ్యాన్స్‌ తో సరదాగా ముచ్చటిస్తూ ఉంటుంది. అలా తాజాగా తన అభిమానులతో ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ‘ఆస్క్ మీ ఎనీథింగ్’ సెషన్ నిర్వహించింది. ఇందులో భాగంగా ఎంతోమంది అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సరదాగా సమాధానాలు ఇచ్చింది. అయితే ఓ నెటిజన్‌ మాత్రం సారాను ఇబ్బంది పెడదామని ప్రయత్నించాడు. ఆమెకు చికాకు కలిగించేలా ప్రశ్న వేశాడు. అయితే సంయమనం పాటించిన ఈ ముద్దుగుమ్మ ఆ ఆకతాయికి దిమ్మతిరిగేలా తనదైన స్టైల్‌లో సమాధానమిచ్చింది.

నా సంతోషానికి కారణాలు చెప్పాల్సిన అవసరం లేదు! ఈ ఛాట్‌ సెషన్‌ లో భాగంగా ఒక నెటిజన్‌ ‘మీ షాయిరీలు (కవితలు) ఎందుకు అంత దారుణంగా ఉంటాయి?’ అని సారాని అడిగాడు. దీనికి బదులిస్తూ ‘ఎందుకంటే నేను నీలాంటి పాజిటివ్‌గా ఉండేవాళ్లని పిచ్చోళ్లుగా మారుస్తాను. నీలాంటివారు చేసే పిచ్చి కామెంట్లకి నేను ఏ మాత్రం కుంగిపోను. తల్లిదండ్రులపై ఆధారపడకుండా నాకు నేనుగా ఎదిగాను. నా సంతోషానికి కారణాలు చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికైనా మీకు నా షాయరీ నచ్చిందని అనుకుంటున్నా. నచ్చకపోతే మీ ఖర్మ’ అంటూ కవితతోనే సమాధానమిచ్చింది. దీంతో ఆ నెటిజన్‌ నోటి నుంచి మాట రాలేదు. కాగా తనను ఇబ్బంది పెట్టాలన్న ఆకతాయికి సారా స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చిందని ఆమె అభిమానులు మురిసిపోతున్నారు.

Also Read:AHA Unstoppable: సీక్రెట్‌గా ఎందుకు పెళ్లి చేసుకున్నావ్‌? బాలయ్య ప్రశ్నకు మహేశ్‌ రియాక్షన్‌ చూడండి..

Rashmika Mandanna: కొత్త ఇంట్లోకి మారుతోన్న కన్నడ ముద్దుగుమ్మ!.. సామాన్లు ప్యాక్‌ చేసుకోవడం కష్టంగా ఉందంటూ..

RRR Movie: మరో 50 రోజుల్లో ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా.. కౌంట్‌డౌన్‌ స్టార్ట్ అంటూ కొత్త పోస్టర్‌ ను రిలీజ్‌ చేసిన జక్కన్న టీం..

గురువుకి రెట్టింపు బలం.. ఆ రాశుల వారికి కనక వర్షం పక్కా..!
గురువుకి రెట్టింపు బలం.. ఆ రాశుల వారికి కనక వర్షం పక్కా..!
మీరు డ్రైవింగ్‌లో అంబులెన్స్‌కు దారి ఇవ్వకుంటే ఏమవుతుందో తెలుసా?
మీరు డ్రైవింగ్‌లో అంబులెన్స్‌కు దారి ఇవ్వకుంటే ఏమవుతుందో తెలుసా?
ఇదో రకం పిచ్చి..! అగ్నిపర్వతం లావాతో సిగరెట్‌ వెలిగించుకోవాలని
ఇదో రకం పిచ్చి..! అగ్నిపర్వతం లావాతో సిగరెట్‌ వెలిగించుకోవాలని
టీమిండియా ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. వాళ్లకు ఇదే చివరి టోర్నీ?
టీమిండియా ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. వాళ్లకు ఇదే చివరి టోర్నీ?
ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు