AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Childhood Pic:ఈ ఫోటో ఆ పాత మధురం.. అమ్మగా, బామ్మగా సిని ప్రేక్షకులకు సుపరిచితం.. ఎవరో గుర్తు పట్టరా..

Childhood Pic: ఆ పాత మధురం ఈ ఫోటోలు.. ఈ ఫోటోలోని యువతి.. బామ్మగా కొన్ని జనరేషన్లకు సుపరిచితం. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో హీరోయిన్ గా అడుగు పెట్టి.. బామ్మ పాత్రలకు పోసిన సహజ నటి..

Childhood Pic:ఈ ఫోటో ఆ పాత మధురం.. అమ్మగా, బామ్మగా సిని ప్రేక్షకులకు సుపరిచితం.. ఎవరో గుర్తు పట్టరా..
Nirmalamma Chilhood Pic
Surya Kala
|

Updated on: Feb 03, 2022 | 10:17 PM

Share

Childhood Pic: ఆ పాత మధురం ఈ ఫోటోలు.. ఈ ఫోటోలోని యువతి.. బామ్మగా కొన్ని జనరేషన్లకు సుపరిచితం. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో హీరోయిన్ గా అడుగు పెట్టి.. బామ్మ పాత్రలకు పోసిన సహజ నటి నిర్మలమ్మNirmalamma). అమ్మగా, అత్తగా, బామ్మగా .. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అనేక పాత్రలలో నటించిన సహజ నటిగా గుర్తింపు పొందారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు ప్రాణ తో భారత్ కీ మా అని ఆప్యాయంగా పిలిపించుకున్న నిర్మలమ్మ.. యంగ్ ఏజ్ లో ఉన్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. నాటకాల నుంచి వెండి తెరపై అడుగు పెట్టిన నిర్మల అసలు పేరు రాజమణి. షూటింగ్ జరిగే సమయంలో అక్కడ ఉండేవారిని అందరినీ ప్రేమగా తల్లిలా ఆదరించడంతో అందరూ (నిర్మల+అమ్మ) నిర్మలమ్మ అని పిలిచేవారు.. ఇక కాలక్రమంలో నిర్మల కాస్త నిర్మలమ్మగా స్థిరపడిపోయింది.

నిర్మలమ్మ అసలు పేరు రాజమణి. స్వస్థలం కృష్ణా జిల్లా బందరు. చిన్నతనంనుంచి నాటకాలంటే ఆమెకు ప్రాణం. ఏక వీర నాటకంలో గిరిక పాత్రలో నిర్మల నటనను చూసి కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ ప్రశంసల వర్షం కురిపించారు. నిర్మలమ్మ ఆడపెత్తనం సినిమాలో హీరోయిన్ గా చేయాల్సింది. అయితే అది కుదర్లేదు. అనంతరం 1943లో తన పదహారేళ్ల వయసులో గరుడ గర్వభంగం సినిమాలో చెలికత్తె పాత్రలో తొలిసారిగా వెండి తెరపై అడుగు పెట్టి.. సుమారు వెయ్యి సినిమాల్లో నటించారు. తనకన్నా పెద్దవారైన ఎన్టిఆర్, ఎన్నార్, యస్వీఆర్ ల నుంచి చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, యంగ్ హీరోల వరకూ ఎందరి హీరోలకో బామ్మగా, అమ్మగా నటించారు. మయూరి, సీతారామరాజు సినిమాలకు నంది అవార్డులను అందుకున్నారు.

వయసు రీత్యా ఓపికలేక ఆరోగ్యకారణాలతో నటన విరమించుకున్న నిర్మలమ్మ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి బలవంతం మీద ప్రేమకు ఆహ్వానంలో నటించడానికి ఒప్పించారు. అదే నిర్మలమ్మ చివరి సినిమా.

Also Read:

మెగా హీరో సినిమా నుంచి మరో అప్డేట్‌.. అలరిస్తోన్న రంగ రంగ వైభవంగా మెలోడీ సాంగ్‌..