Shah Rukh Khan: అక్కడ ఉన్నది కింగ్ ఖాన్.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన షారుక్ ఖాన్..
'జవాన్' , 'పఠాన్' సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్ల రూపాయలకు పైగా వసూలు చేశాయి. అయితే ఈ సినిమాల విజయాన్ని కొందరు తట్టుకోలేకపోయారు. ఐతే ఈ సినిమాల గురించి ఓ నెటిజన్ దారుణంగా మాట్లాడాడు. దానికి షారూఖ్ ఘాటుగా సమాధానం ఇచ్చాడు. సోషల్ మీడియాలో షారుఖ్ ఖాన్ అభిమానులతో టచ్ లో ఉంటాడు.

బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ ఈ ఏడాది రెండు విజయాలు అందుకొని ఫుల్ జోష్ లో ఉన్నాడు. ‘జవాన్’ , ‘పఠాన్’ సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్ల రూపాయలకు పైగా వసూలు చేశాయి. అయితే ఈ సినిమాల విజయాన్ని కొందరు తట్టుకోలేకపోయారు. ఐతే ఈ సినిమాల గురించి ఓ నెటిజన్ దారుణంగా మాట్లాడాడు. దానికి షారూఖ్ ఘాటుగా సమాధానం ఇచ్చాడు. సోషల్ మీడియాలో షారుఖ్ ఖాన్ అభిమానులతో టచ్ లో ఉంటాడు. ఎప్పటికప్పుడు ఓ సెషన్ (ఆస్క్ SRK) అంటూ అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటాడు.
షారుఖ్ ఖాన్ నటించిన ‘డంకీ’ ట్రైలర్‌కి మంచి స్పందన వచ్చింది. అలాగే ఆయన కూతురు సుహానా ఖాన్ మొదటి సినిమా ‘ది ఆర్చీస్’ నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. ఈ సందర్భంగా అభిమానులతో షారుక్ ఆస్క్ SRK నిర్వహించారు. అయితే ఈ అవకాశాన్ని కొందరు దుర్వినియోగం చేసుకున్నారు. షారుఖ్‌ను ట్రోల్ చేసే సాహసం కొందరు చేశారు. అలాంటి వారికి షారూక్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు.
‘మీ చెత్త సినిమాలు జవాన్ , పఠాన్ పబ్లిసిటీ కారణంగా విజయవంతమయ్యాయి. అదే పబ్లిసిటీతో డుంకీ సినిమా కూడా సూపర్ హిట్ అవుతుందంటే నమ్ముతారా.? అని ఓ నెటిజన్ ప్రశ్నించాడు. షారుఖ్ ఖాన్ ప్రశ్నను పట్టించుకోకుండా మిగిలిన నెటిజన్స్ కు రిప్లే ఇస్తూ వచ్చాడు.. కానీ అతను అదే ప్రశ్నను తిరిగి మళ్లీ అడిగాడు. దానికి షారుక్ ఖాన్ స్పందిస్తూ.. ‘సాధారణంగా నేను మీలాంటి సూపర్ స్మార్ట్ వ్యక్తులకు సమాధానం చెప్పను. కానీ నేను మీకు సమాధానం ఇస్తాను. ఎందుకంటే మలబద్ధకం సమస్యకు చికిత్స అవసరమని మీరు అనుకుంటున్నారు. నా ప్రచార బృందానికి చెప్పి నేను మీకు మందులు పంపుతాను. మీరు త్వరగా కోలుకుంటారని ఆశిస్తున్నాను’ అని షారుక్ ఖాన్ పోస్ట్ చేశాడు.
మరికొందరు ‘ఈ సినిమాలో బోల్డ్ సీన్స్ ఉన్నాయా.? నాన్నతో కలిసి సినిమా చూడొచ్చా అని కూడా అడిగాడు. ఎలాంటి ఇబ్బంది కలిగించే సన్నివేశాలు ఉండవని షారుక్ ఖాన్ చెప్పాడు. ఈ చిత్రానికి రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వం వహిస్తున్నారు. షారూఖ్‌తో పాటు తాప్సీ పన్ను, విక్కీ కౌశల్ కూడా నటించారు. డిసెంబర్ 21న ‘డంకీ’ విడుదల కానుంది.
Normally I don’t answer amazingly intelligent people like you. But in your case I am making an exception because I feel you need to be treated for constipation. Will tell my PR team to send you some golden medicines…hope u recover soon. https://t.co/FmKfCZxmyp
— Shah Rukh Khan (@iamsrk) December 6, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




