Shiva Rajkumar: రామ్ చరణ్, నాని సినిమాల్లో కీలక పాత్రల్లో శివరాజ్ కుమార్.. ఇదిగో క్లారిటీ
ఇప్పటికే తమిళ స్టార్ హీరో ధనుష్ తో ఓ సినిమాలో నటించిన శివన్న.. టాలీవుడ్ స్టార్ యాక్టర్ రామ్ చరణ్ తో కొత్త సినిమాలో నటించనున్నారని గతకొన్నిరోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. రామ్ చరణ్ సినిమాలో శివన్న స్పెషల్ రోల్ చేస్తున్నారని వస్తున్న వార్తలు వైరల్ అవుతుండటంతో శివన్న ఈ విషయంపై స్పందించారు.

శివ రాజ్ కుమార్ .. కన్నడ చిత్ర పరిశ్రమలో అత్యంత బిజీ స్టార్. తమిళ సినిమా ‘జైలర్’లో క్యామియో రోల్ చేసిన తర్వాత శివన్నకు ఇతర భాషల్లో డిమాండ్ బాగా పెరిగింది. ఇప్పటికే తమిళ స్టార్ హీరో ధనుష్ తో ఓ సినిమాలో నటించిన శివన్న.. టాలీవుడ్ స్టార్ యాక్టర్ రామ్ చరణ్ తో కొత్త సినిమాలో నటించనున్నారని గతకొన్నిరోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. రామ్ చరణ్ సినిమాలో శివన్న స్పెషల్ రోల్ చేస్తున్నారని వస్తున్న వార్తలు వైరల్ అవుతుండటంతో శివన్న ఈ విషయంపై స్పందించారు.
రామ్ చరణ్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఓ భారీ చిత్రం చేస్తున్నాడు. గేమ్ చెంజర్ అనే టైటిల్ తో తెరకెక్కుతోంది. ఈ సినిమా తర్వాత ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. గతంలో వచ్చిన ఉప్పెన సినిమాలో తమిళ్ స్టార్ నటుడు విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటించాడు. ఇప్పుడు రామ్ చరణ్ సినిమాలో శివ రాజ్ కుమార్ కీలక పాత్రలో నటించనున్నాడని టాక్ చక్కర్లు కొడుతున్నాయి. దీని పై శివన్న మాట్లాడుతూ.. రామ్ చరణ్ సినిమా గురించి ఇంకా ఏమీ చెప్పాలను..దీని గురించి కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కానీ నేను దీని పై మాట్లాడలేను. ఇప్పుడే మాట్లాడి ఆ సినిమా చేయకపోతే అభిమానులు నిరాశపడతారు. ‘ఉప్పెన’ సినిమా చేసిన బుచ్చిబాబు నన్ను కలవాలని కోరాడు. ఏం జరుగుతుందో చూద్దాం’ అని శివరాజ్ కుమార్ అన్నారు.
ఇటీవల హీరో నాని శివరాజ్ కుమార్ ను కలిసిన విషయం తెలిసిందే. దీని గురించి మాట్లాడుతూ.. ‘నేను ఒక సినిమాలో అతిధి పాత్రలో నటించాలని కొంతకాలం క్రితం నానిని పిలిచాను. వెంటనే ఎస్ నేను వచ్చి కలుస్తాను అని చెప్పగా వద్దు నేనే అక్కడికి వస్తాను అన్నాడు. కానీ ఆ సినిమా జరగలేదు. ఇప్పుడు వచ్చి కలిశారు. ఇద్దరం కలిసి సినిమా చేద్దామని అనుకున్నాం’ అని శివరాజ్ కుమార్ అన్నారు.
ఓటీటీలో కూడా ‘ఘోస్ట్’ చిత్రానికి భారీ రెస్పాన్స్ రావడంపై శివరాజ్‌కుమార్ మాట్లాడుతూ.. ‘మా సినిమాకు ఆస్ట్రేలియా, అమెరికా, యూకేల్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. అప్పుడు కొన్ని పెద్ద సినిమాలే వచ్చాయి. అయినా కూడా మా సినిమా బాగానే ఆడింది’ అన్నారు.
శివన్న నటించిన ‘గోస్ట్ ‘ చిత్రం అక్టోబర్ 19న థియేటర్లలో విడుదలైంది. సినిమా థియేటర్లలో సూపర్ హిట్ అయింది. ఈ చిత్రానికి శ్రీని దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో శివన్నతో పాటు అనుపమ్ ఖేర్, జయరామ్ తదితరులు నటించారు. G5 సినిమా OTTలో విడుదలై అక్కడ కూడా సూపర్ హిట్ అయింది.




