“నేను ఒళ్లు అమ్ముకోలేదు.. కానీ “.. సీరియల్ నటి ఆవేదన
ఛాన్స్ లు తగ్గిపోవడంతో కొంతమంది దీన స్థితిలో కూరుకుపోయారు. మరికొంతమంది ఇతరపనులు చేసుకుంటున్నారు. కొంతమంది క్యాస్టింగ్ కౌచ్ బారిన పడిన విషయాలను గుర్తు చేసుకున్నారు. లైంగిక వేధింపుల గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. తాజాగా ఓ నటి తాను పడిన కష్టాలు గురించి తెలిపింది. ఛాన్స్ లకోసం నానా కష్టాలు పడ్డాను అని తెలిపింది.

సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం అంత సులభమైన పని కాదు. ఎంతో మంది ఇండస్ట్రీలో రాణించాలని సొంత ఊర్లు వదిలి నగరాల్లో గడుపుతున్నారు. ఇంకొంతమంది వచ్చిన అవకాశాలను నిలబెట్టుకోవడం కోసం కష్టపడుతూ ఉంటారు. ఛాన్స్ లు తగ్గిపోవడంతో కొంతమంది దీన స్థితిలో కూరుకుపోయారు. మరికొంతమంది ఇతరపనులు చేసుకుంటున్నారు. కొంతమంది క్యాస్టింగ్ కౌచ్ బారిన పడిన విషయాలను గుర్తు చేసుకున్నారు. లైంగిక వేధింపుల గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. తాజాగా ఓ నటి తాను పడిన కష్టాలు గురించి తెలిపింది. ఛాన్స్ లకోసం నానా కష్టాలు పడ్డాను అని తెలిపింది. ఛాన్స్ లకోసం చీరలు కూడా అమ్మే అని తెలిపింది. ఆమె ఎవరో కాదు.. మల్లిక జాగుల .
మల్లిక జాగుల బుల్లి తెరపై చాలా సీరియల్స్ లో విలన్ పాత్రల్లో నటించింది మల్లిక. పలు సీరియల్స్ తోపాటు సినిమాల్లోనూ నటించింది. తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న మల్లిక తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ విషయాలు తెలిపారు. తెలుగు వాళ్లకు ఇండస్ట్రీలో అవకాశాలు దక్కడం లేదు.. మలయాళ, కన్నడ, హిందీ బాషలనుంచి ఆర్టిస్ట్ లను తీసుకొచ్చుకుంటున్నారు అని అన్నారు మల్లిక.
చాలా కాలం నాకు సినిమాల్లో అవకాశాలు రాలేదు. దాంతో నేను డిప్రషన్ లోకి వెళ్ళాను. అదే టైం లో అనారోగ్య సమస్యలు తలెత్తాయి. హాస్పటల్ కు తీసుకెళ్తే బతకడం కష్టం అని డాక్టర్స్ అన్నారు. కానీ ఎలాగోలా బ్రతికి బయట పడ్డా అని తెలిపింది. సినీ ఇండస్ట్రీ అంటే చాలా మంది చాలా ఊహించుకుంటారు. కానీ ఇక్కడ మహిళలకు ముళ్ల జీవితం. కెరీర్ బాగున్నంత వరకు ఓకే.. కానీ తేడా కొడితే మాత్రం కష్టం అని తెలిపింది మల్లిక. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ తో చాలా మంది యువతులు బాధపడుతున్నారు. నేను కూడా క్యాస్టింగ్ కౌచ్ బాధితురాలిని.. కరోనా తర్వాత చాలా కష్టాలు పడ్డాను. అవకాశాలు లేక చీరలు కూడా అమ్మాను.. ఎక్కువ వ్యాంప్ క్యారెక్టర్స్ చేయడం వల్ల నన్ను చాలా చులకనగా.. తక్కువగా చూశారు. నన్ను కొంతమంది కమిట్ మెంట్ అడిగారు.. కానీ నేను ఒప్పుకోలేదు. నెలరోజులు టార్చర్ పెట్టారు.. అవకాశాలు రాకుండా చేశారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. “నేను ఒళ్లు అమ్ముకోలేదు.. ఒళ్ళు చూపించను” అంతే అని చెప్పుకొచ్చింది మల్లిక.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.