Bigg Boss Telugu: బిగ్ బాస్ సీజన్ 7లోకి సీరియల్ యాక్టర్ అమర్ దీప్.. ఇదిగో క్లారిటీ
బిగ్ బాస్ సీజన్ 1 కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించి సూపర్ సక్సెస్ చేశారు. అలాగే సెకండ్ సీజన్ కు నాని హోస్ట్ గా చేసి అలరించారు. ఆ తర్వాత కింగ్ నాగార్జున బిగ్ బాస్ సీజన్స్ కు నాగార్జున హోస్ట్ గా చేశారు. సీజన్ 3,4,5,6 కు నాగార్జున హోస్ట్ గా చేస్తూ వచ్చారు.

తెలుగు రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇప్పటికే బిగ్ బాస్ ఆరు సీజన్స్ పూర్తి చేసుకుంది. బిగ్ బాస్ సీజన్ 1 కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించి సూపర్ సక్సెస్ చేశారు. అలాగే సెకండ్ సీజన్ కు నాని హోస్ట్ గా చేసి అలరించారు. ఆ తర్వాత కింగ్ నాగార్జున బిగ్ బాస్ సీజన్స్ కు నాగార్జున హోస్ట్ గా చేశారు. సీజన్ 3,4,5,6 కు నాగార్జున హోస్ట్ గా చేస్తూ వచ్చారు. త్వరలోనే సీజన్ 7 మొదలు కానుంది. ఇప్పటికే బిగ్ బాస్ 7 గురించి రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. బిగ్ బాస్ 7లో పాల్గొనే కంటెస్టెంట్స్ గురించి నిత్యం ఎదో ఒక వార్త హల్ చల్ చేస్తూనే ఉంది. ఈ క్రమంలో బిగ్ బాస్ సీజన్ 7 లో సీరియల్ యాక్టర్ అమర్‌దీప్ పాల్గొంటున్నాడని వార్తలు వైరల్ అవుతున్నాయి.
తాజాగా ఈ విషయం పై క్లారిటీ ఇచ్చాడు అమర్‌దీప్. ఓ ఇంటర్వ్యూలో అమర్‌దీప్ మాట్లాడుతూ .. బిగ్ బాస్ హౌస్ కు వెళ్తున్నా అనే వార్తలు నేను కూడా విన్నా.. ఇప్పటివరకు ఈ విషయం పై క్లారిటీ లేదు. అది నా చేతుల్లో లేదు. అది మా చానల్ ఇష్టం అని అన్నాడు అమర్
ప్రస్తుతం నేను సీరియల్స్ చేస్తూ బిజీగా ఉన్నాను.. మరి బిగ్ బాస్ కు నన్ను పిలుస్తారో లేదో చూడాలి అని క్లారిటీ ఇచ్చాడు అమర్ దీప్. నాకు ఆఫర్ వస్తే తప్పకుండా బిగ్ బాస్ హౌస్ కు వెళ్తాను అని అన్నారు అమర్ దీప్.




