Balakrishna: బాలయ్య బ్యాటింగా.. మజాకా.. బరిలోకి దిగితే దబిడి దిబిడే.. ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకుంటోన్న వీడియో

ఇప్పటికే తన దైన నటన, డెలాగ్‌ డెలివరీతో అభిమానుల్లో మాస్‌ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు బాలయ్య. అలాగే అన్​స్టాపబుల్ అంటూ బుల్లితెర ప్రేక్షకులకు నాన్‌స్టాప్‌ వినోదం అందిస్తున్నారు. అలాంటి బాలయ్య క్రికెట్‌ కామెంట్రీ వినేందుకు అటు మూవీ ఫ్యాన్స్‌తో పాటు ఇటు ..

Balakrishna: బాలయ్య బ్యాటింగా.. మజాకా.. బరిలోకి దిగితే దబిడి దిబిడే.. ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకుంటోన్న వీడియో
Nandamuri Balakrishna
Follow us
Basha Shek

|

Updated on: Mar 29, 2023 | 11:58 AM

నందమూరి నటసింహం బాలకృష్ణ త్వరలోనే కామెంటేటర్‌గా కొత్త అవతారంలో కనిపించనున్నారు. మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్న ఐపీఎల్‌-16 సీజన్‌లో తెలుగు కామెంటేటర్‌గా అలరించనున్నారాయన. ఇప్పటికే తన దైన నటన, డెలాగ్‌ డెలివరీతో అభిమానుల్లో మాస్‌ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు బాలయ్య. అలాగే అన్​స్టాపబుల్ అంటూ బుల్లితెర ప్రేక్షకులకు నాన్‌స్టాప్‌ వినోదం అందిస్తున్నారు. అలాంటి బాలయ్య క్రికెట్‌ కామెంట్రీ వినేందుకు అటు మూవీ ఫ్యాన్స్‌తో పాటు ఇటు క్రికెట్‌ ఫ్యాన్స్‌ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ఐపీఎల్‌ తాజా సీజన్‌ తొలి రోజు స్టార్‌స్పోర్ట్స్‌ తెలుగులో బాలకృష్ణ కామెంట్రీ చేయనున్నారు. క్రికెట్‌ మీద ఉన్న మక్కువ తో నిర్వాహకులు అడిగిన వెంటనే బాలకృష్ణ కామెంట్రీకి అంగీకరించారని తెలుస్తోంది. తాజాగా ప్రమోషన్లలో భాగంగా స్టార్‌ స్పోర్ట్స్ ఎక్స్‌పర్ట్‌ ఎమ్మెస్కే ప్రసాద్, వేణుగోపాల రావుతో కలసి సరదాగా గల్లీ క్రికెట్ ఆడారు బాలయ్య. ఈ గేమ్‌కు స్టార్ స్పోర్ట్స్ ప్రెజెంటర్ వింధ్య అంపైర్​గా వ్యవహరించింది.

ఈ సందర్భంగా మాజీ క్రికెటర్‌ వేణుగోపాల రావు బాల్ బౌలింగ్‌ చేయగా భారీ షాట్లతో విరుచుకుపడ్డారు బాలయ్య. చూడముచ్చటైన షాట్లతో ఆకట్టుకున్నారు. ఆతర్వాత బంతిని అందుకుని బౌలింగ్‌ కూడా చేశారీ నందమూరి హీరో. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. ముఖ్యంగా నందమూరి ఫ్యాన్స్‌ను ఈ వీడియో తెగ ఆకట్టుకుంటోంది. ఇక సినిమాల విషయానికొస్తే.. బాలయ్య ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా.. లేటెస్ట్‌ సెన్సేషన్‌ శ్రీలీల బాలయ్య కూతురి పాత్రలో కనిపించనుంది. తండ్రీ కూతుళ్ల సెంటిమెంట్​తో ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. షైన్ స్క్రీన్స్‌ బ్యానర్​పై హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మిస్తోన్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది.

ఇవి కూడా చదవండి

బాలయ్య బ్యాటింగ్ వీడియో..

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..